AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? టాలీవుడ్‌ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ .. మన హన్మకొండ అబ్బాయే

పై ఫొటోలో కనిపిస్తోన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఈ అబ్బాయి ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేయగలడు.. కెమెరాల ముందు అద్భుతంగా నటించగలడు. అంతేకాదు తన లాంటి నటీనటులను ప్రోత్సహించేందుకు నిర్మాతగా కూడా మారతాడు.  బుల్లెట్ లా మాటల తూటాలను కూడా పేల్చగలడు

Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? టాలీవుడ్‌ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ .. మన హన్మకొండ అబ్బాయే
Tollywood Celebrity Childhood Photo
Basha Shek
|

Updated on: Aug 06, 2024 | 7:31 PM

Share

పై ఫొటోలో కనిపిస్తోన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఈ అబ్బాయి ఇప్పుడు టాలీవుడ్ లో బాగా ఫేమస్. మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేయగలడు.. కెమెరాల ముందు అద్భుతంగా నటించగలడు. అంతేకాదు తన లాంటి నటీనటులను ప్రోత్సహించేందుకు నిర్మాతగా కూడా మారతాడు.  బుల్లెట్ లా మాటల తూటాలను కూడా పేల్చగలడు. అందుకే తన మొదటి సినిమాకే జాతీయ అవార్డు అందుకున్నాడు. వరంగల్ కు చెందిన ఈ అబ్బాయి మొదట షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నటుడిగా మారాడు. యాంకర్ గా కూడా సత్తా చాటుతున్నాడు. రైటర్ గా, హీరోగా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్ గా..ఇలా తన మల్టీ ట్యాలెంట్ తో దూసుకుపోతున్న ఈ సెలబ్రిటీ స్వస్థలం మన వరంగల్ నే. అన్నట్లు ఇతని తల్లి కూడా టాలీవుడ్ బాగా ఫేమస్. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫీల్ గుడ్ మూవీ ఫిదాలో ఆమె ఓ కీలక పాత్ర పోషించింది. మరి ఈ టాలీవుడ్ మల్టీ ట్యాలెంటెడ్ సెలబ్రిటీ ఎవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు పెళ్లి చూపులు సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న తరుణ్ భాస్కర్. ఇది అతని చిన్ననాటి ఫొటో.

పెళ్లి చూపులు, ఏమైంది ఈ నగరానికి, కీడాకోలా సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. మహానటి, సమ్మోహనం, ఫలక్ నుమా దాస్ సినిమాల్లో నటుడిగా మెప్పించాడు. అలాగే మీకు మాత్రమే చెప్తా సినిమాతో సోలో హీరోగానూ సక్సెస్ అయ్యాడు. మిడిల్ క్లాస్ మెలోడీస్, స్కై ల్యాబ్, సీతా రామం, దాస్ కా దమ్కీ, హాస్టల్ బాయ్స్, కీడా కోలా, మంగళవారం, ధూత తదితర సినిమాల్లో నూ వివిధ పాత్రలు పోషించాడు. కాగా ఈ క్రేజీ డైరెక్టర్ఇ ప్పుడు ఆసక్తికరంగా ఇడుపు కాయితం పంచాయతీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తరుణ్‌ భాస్కర్‌-వేణు ఊడుగుల కాంపౌండ్ నుంచి రాబోతున్న సినిమా ప్రొడక్షన్‌ నంబర్‌ 2 గా త్వరలోనే తెరకెక్కనుంది. డెబ్యూ డైరెక్టర్‌ వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని యారో సినిమాస్‌, దొలముఖి సుభుల్ట్రన్‌ ఫిల్మ్స్‌ బ్యానర్లపై వేణు ఊడుగుల, జగన్ మోహన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తల్లి గీతా భాస్కర్ తో తరుణ్ భాస్కర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us