Uppena Movie : ‘ఉప్పెన’ సినిమా పైన కన్నేసిన బాలీవుడ్ యంగ్ హీరో.. హీరోయిన్ ఎవరో తెలుసా..

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ  సినిమాలో అందాల..

Uppena Movie : 'ఉప్పెన' సినిమా పైన కన్నేసిన బాలీవుడ్ యంగ్ హీరో.. హీరోయిన్ ఎవరో తెలుసా..
Follow us

|

Updated on: Mar 10, 2021 | 12:58 AM

Uppena Movie : మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ  సినిమాలో అందాలభామ కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక అందమైన ప్రేమ కథగా తెరక్కేక్కిన ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నాటించి ఆకట్టుకున్నాడు. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమాను ఇప్పుడు రీమేక్ చేయాలనీ పలు బాషల దర్శక నిర్మాతలు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేయాలనీ పలువురు దర్శకులు ప్రయత్నిస్తున్నారు. కాగా విజయ్ సేతుపతి ఈ సినిమా తమిళ్ రైట్స్ పై కన్నేసినట్లు టాక్ అయితే వస్తోంది. ఎందుకంటే కోలీవుడ్ స్టార్ హీరో తనయుడి ఎంట్రీకి ఆ కథ కరెక్ట్ గా సరిపోతుందట. ఇంతకు ఆ స్టార్ కిడ్ ఎవరంటే.. దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్. ఇప్పటికే ఈ సినిమాను సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయట . ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇషాన్ ఖట్టర్ – అనన్య పాండే హీరోహీరోయిన్లుగా ఈ రీమేక్ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా పైన ఓ బాలీవుడ్ యంగ్ హీరో మనసుపడ్డాడంట. ఆహీరో ఎవరో కాదు వరుణ్ ధావన్. ఇటీవల ఈ సినిమా చుసిన వరుణ్ ఎలాగైనా ఈ సినిమాను రీమేక్ చేయాలనీ భావిస్తున్నాడట. ఈ రీమేక్ లో కృతీశెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Virata Parvam : ఆకట్టుకుంటున్న విరాటపర్వం ‘కోలు కోలమ్మా కోలో.. కోలో’ గీతం.. మేకింగ్ వీడియోను విడుదల చేసిన చిత్రయూనిట్..

AnushkaShetty : కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్న అనుష్క.. త్వరలో ఆ సినిమా రీమేక్‌‌‌‌‌‌లో స్వీటీ..