Virata Parvam : ఆకట్టుకుంటున్న విరాటపర్వం ‘కోలు కోలమ్మా కోలో.. కోలో’ గీతం.. మేకింగ్ వీడియోను విడుదల చేసిన చిత్రయూనిట్..

దగ్గుబాటి వారబ్బాయి రానా ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే అరణ్య సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాట పర్వం

Virata Parvam : ఆకట్టుకుంటున్న విరాటపర్వం 'కోలు కోలమ్మా కోలో.. కోలో' గీతం.. మేకింగ్ వీడియోను విడుదల చేసిన చిత్రయూనిట్..
Follow us

|

Updated on: Mar 10, 2021 | 12:43 AM

Virata Parvam : దగ్గుబాటి వారబ్బాయి రానా ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే అరణ్య సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే వేణు ఉడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ అనే సినిమా చేస్తున్నాడు. ఆతర్వాత గుణశేఖర్ దర్శకత్వంలోని హిరణ్య కశ్యప సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే విరాట పర్వం సినిమాలో రానాకు జోడీగా సాయిపల్లవి నటిస్తుంది. ఆ ఆమధ్య విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ లు సినిమా పైన ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమానుంచి ‘కోలు కోలమ్మా కోలో.. కోలో” అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అందమైన సాహిత్యంతో సాగిన ఈ పాటలో సాయి పల్లవి అభినయం ఆకట్టుకుంది.

తాజాగా ఈ పాట మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘కోలు కోలు’ గీతానికి ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ అందమైన సాహిత్యం అందించారు. అలాగే సింగర్ దివ్య మాలిక – సురేష్ బొబ్బిలి కలసి ఈ పాటను ఆలపించారు. ‘స్వచ్ఛమైన పల్లెటూరిలో పెరిగిన యువతి మనసులో ప్రేమ కలిగితే అది ఎంత గాఢంగా ఎంత సాంద్రముగా ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడమే ఈ పాట ముఖ్య ఉద్దేశ్యం” అని చంద్రబోస్ అన్నారు. ఇంతమంచి స్వచ్ఛమైన మట్టి వాసన ఉన్న బాణీ రావడానికి కారణం స్క్రిప్ట్ అని సింగర్ సురేష్ బొబ్బిలి అన్నారు. చంద్రబోస్ గారు బాణీ విని అందమైన లిరిక్స్ రాసారని సురేష్ బొబ్బిలి అన్నారు. డి.సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

AnushkaShetty : కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్న అనుష్క.. త్వరలో ఆ సినిమా రీమేక్‌‌‌‌‌‌లో స్వీటీ..

కేజీఎఫ్ స్టార్ యష్ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వివాదం.. అసలు కారణం ఇదే.!

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు