Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana 3D: బాలీవుడ్ భారీ సినిమాలో మహేష్ ప్లేస్‌ను రీప్లేస్ చేసే హీరో దొరకడం లేదట.?

బాలీవుడ్‌లో మరో బిగ్‌ బడ్జెట్‌ రామాయణం రెడీ అవుతోంది. సౌత్ ప్రొడ్యూసర్‌ విష్ణు ఇందూరి నిర్మాతగా.. బాలీవుడ్‌ మేకర్‌ నితీష్ తివారీ డైరెక్షన్‌లో మెగా బడ్జెట్‌తో రామాయణ..

Ramayana 3D: బాలీవుడ్ భారీ సినిమాలో మహేష్ ప్లేస్‌ను రీప్లేస్ చేసే హీరో దొరకడం లేదట.?
Mahesh
Follow us
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Aug 23, 2021 | 8:05 AM

Ramayana 3D: బాలీవుడ్‌లో మరో బిగ్‌ బడ్జెట్‌ రామాయణం రెడీ అవుతోంది. సౌత్ ప్రొడ్యూసర్‌ విష్ణు ఇందూరి నిర్మాతగా.. బాలీవుడ్‌ మేకర్‌ నితీష్ తివారీ డైరెక్షన్‌లో మెగా బడ్జెట్‌తో రామాయణ మహాకావ్యాన్నీ సిరీస్‌గా రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. మహేష్‌, హృతిక్‌‌లాంటి టాప్‌ స్టార్స్‌తో ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్‌కు కాస్టింగ్ విషయంలోనే ఇంకా క్లారిటీ రాలేదు. ఆల్రెడీ రావణుడిగా హృతిక్‌ ఫిక్స్‌ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాముడు ఎవరు..? ఈ విషయంలోనే ఇప్పుడు మెయిన్‌గా సెర్చింగ్‌ జరుగుతుంది. ముందు రాముడి క్యారెక్టర్‌కు టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్ బాబు పేరు గట్టిగా వినిపించింది. కానీ ప్రజెంట్ ఉన్న కమిట్మెంట్స్ కారణంగా మహేష్ ఆ రోల్‌ చేయటం అసాధ్యం అని తేలిపోయింది. అందుకే మరో హీరోను వెతికే పనిలో ఉన్నారు.Maheshడైరెక్టర్ నితీష్ మాత్రం రాముడి పాత్రకు సాఫ్ట్ అండ్ స్టైలిష్ హీరోనే కావాలని ఫిక్స్ అయ్యారు. అందుకే మహేష్ మిస్ అయితే.. ఆ క్యారెక్టర్‌కు బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌ రణబీర్‌ కపూర్‌ను తీసుకోవాలనుకుంటున్నారట. అయితే రణబీర్‌ డేట్స్‌ దొరకటం కూడా అంత ఈజీ ఏం కాదు. ప్రజెంట్ ఫాంటసీ ప్రాంచైజీ బ్రహ్మాస్త్రతో పాటు లవ్‌ రంజన్ సినిమాల్లో నటిస్తున్న రణబీర్‌… నెక్ట్స్ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో యానిమల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలన్నీ పూర్తి కావాలంటే కనీసం రెండు మూడేళ్లన్నా పడుతుంది. మరి రామాయణ మేకర్స్ అప్పటి వరకు వెయిట్ చేస్తారా..? లేకపోతే మరో హీరోను ఓకే చేస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi: చిరు ఇంట కన్నుల పండుగ.. రక్షా బంధన్, బర్త్ డే వేడుక, బ్రదర్స్‌కు రాఖీలు కట్టిన మెగా సోదరీమణులు.. వాచ్ వీడియో

Malli Modalaindi Movie: ఏంటో ఏమో జీవితం.. ఎందుకిలా చేస్తాదో జీవితం.. ‘మళ్ళీ మొదలైంది’ నుంచి ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌

Chiranjeevi Birthday Celebrations: కొణిదెల వారి ఇంటి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే, రాఖీ సెలబ్రేషన్స్..