AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malli Modalaindi Movie: ఏంటో ఏమో జీవితం.. ఎందుకిలా చేస్తాదో జీవితం.. ‘మళ్ళీ మొదలైంది’ నుంచి ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌

Malli Modalaindi Movie Song: నైనా గంగూలీ జంట‌గా టీజీ కీర్తికుమార్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా 'మళ్ళీ మొదలైంది'. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా..

Malli Modalaindi Movie: ఏంటో ఏమో జీవితం.. ఎందుకిలా చేస్తాదో జీవితం.. ‘మళ్ళీ మొదలైంది’ నుంచి ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌
Ento Emo Jeevitham
Subhash Goud
|

Updated on: Aug 22, 2021 | 8:31 PM

Share

Malli Modalaindi Movie Song: నైనా గంగూలీ జంట‌గా టీజీ కీర్తికుమార్ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మళ్ళీ మొదలైంది’. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎంతో ప్రమోషన్‌ వచ్చిన విషయం తెలిసిందే. సుమంత రెండవ పెళ్లి చేసుకోబుతున్నాడు.. సుమంత్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో.. అంటూ సోషల్ మీడియా వైరల్‌ అయిన వైనం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే నెట్టింట్లో ప్రత్యక్షమైన ఆ వెడ్డింగ్ కార్డు నిజ జీవితానికి సంబంధించింది కాదని, సుమంత్ నటిస్తున్న ‘మళ్ళీ మొదలైంది’ సినిమా షూటింగ్ కోసం ప్రింట్ చేసిందని ఆ తర్వాత తెలిసిపోయింది. ఇంతలోనే రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ‘ఒకసారి చేదు అనుభవం ఎదురైనా మళ్ళీ పెళ్ళికి సిద్ధపడ్డావా?’ అంటూ సుమంత్‌కు ట్విట్టర్ వేదికగా క్లాస్ తీసుకున్నాడు. ఆ వార్త ఎంతో వైరల్‌ అయ్యింది కూడా. వాస్తవానికి చెప్పాలంటే.. ఇదంతా పబ్లిసిటీలో భాగంగానే జరిగిందని అనుకోవాలి.

రామ్ గోపాల్ వర్మ ‘ప్రేమకథ’తో పరిచయం చేసి హీరో సుమంత్‌. ఇక ‘మళ్ళీ మొదలైంది’లో హీరోయిన్ నైనా గంగూలీనీ టాలీవుడ్‌కు తీసుకొచ్చింది వర్మే. వీరిద్దరూ జంటగా నటిస్తున్న ‘మళ్ళీ మొదలైంది’ సినిమా గురించి వర్మకు తెలియకుండా ఏ మాత్రం ఉండదు. అందుకే వీరంతా కలిసే.. ఈ వ్యవహారం నడిపి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా.. సుమంత్ గత చిత్రాలకు, ఇప్పటి సెట్స్‌పై ఉన్న సినిమాలకు రాని ఫ్రీ పబ్లిసిటీ ఈ శుభలేఖ, వర్మ ట్వీట్‌తో ‘మళ్ళీ మొదలైంది’కి వచ్చేసిందనే చెప్పాలి.

ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో..

కాగా, ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో డైవర్స్, రీ మ్యారేజ్ అనే అంశంపై తెలుగులో వస్తున్న మొదటి మూవీ తమదేనంటూ సుమంత్ చెప్పుకొచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే ఇది న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అనే విషయాన్ని పోస్టర్‌తో చెప్పేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదలైంది. దీనిని యంగ్ హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘ఏంటో ఏమో జీవితం.. ఎందుకిలా చేస్తాదో జీవితం’ అంటూ సాగే ఈ సాంగ్‌ను కృష్ణ చైతన్య రాయగా, సాయిచరణ్‌ పాడాడు. దీనికి అనూప్ రూబెన్స్ స్వరాలు అందించాడు.

సాధారణంగా ఇలాంటి రిలికల్ వీడియోలకు రెగ్యులర్‌గా ఒకే పేట్రన్‌లో ఉంటాయి. కానీ వాటికి కాస్తంత భిన్నంగా దీనిని మూవీ షూటింగ్ ప్రారంభం నుండి మేకింగ్‌కు సంబంధించిన సీన్స్‌తో నడిపారు. దాంతో ముఖ్య తారాగణంతో పాటు టెక్నీషియన్స్‌కి కూడా ఈ వీడియోలో చోటు దక్కింది. హీరో హీరోయిన్లు సుమంత్, నైనా గంగూలీతో పాటు పోసాని, ఘట్టమనేని మంజుల, సుహాసిని, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిషోర్ తదితరులు ఇందులో చూడవచ్చు.

మూవీ ప్రమోషన్స్‌ కోసం డిఫరెంట్‌ ప్లాన్‌..

కాగా, ఈ మూవీ ప్రమోషన్స్‌ కోసం డిఫరెంట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతున్న మీమ్స్‌ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అలాగే ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో మంచి ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉందని ఈ లిరికల్ వీడియో ద్వారా తెలిసిపోతుంది. ఈ మూవీకి కీర్తి కుమార్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ‘మళ్ళీ రావా’ తర్వాత మరోసారి ‘మళ్ళీ మొదలైంది’ సినిమాతో సుమంత్ హిట్ కొట్టబోతున్నట్లే కనిపిస్తున్నాడు.

Chiranjeevi Birthday Celebrations: కొణిదెల వారి ఇంటి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే, రాఖీ సెలబ్రేషన్స్..