హీరోయిన్ డ్రెస్ చూసి వెంటపడిన వీధి కుక్కలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
బాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. వాటిలో ఈ హీరోయిన్ పేరు కాస్త ఎక్కువగానే వినిపిస్తూ ఉంటుంది...
Rakhi Sawant: బాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. వాటిలో ఈ హీరోయిన్ పేరు కాస్త ఎక్కువగానే వినిపిస్తూ ఉంటుంది. వివాదం లేనిదే నిద్రకూడా పోనీ ఈ భామ. ఇటీవల రోడెక్కి నానా రచ్చ కూడా చేసింది. ఇంతకు ఆ అమ్మడు ఎవరోకాదు రాఖీసావంత్. ఈ హాట్ బ్యూటీ అందాలు ఆరబోయడంలోనే కాదు హాట్ కామెంట్స్‌తో హాట్ టాపిక్ అవ్వడంలోనూ ముందుంటుంది. ఇటీవల తనను బిగ్ బాస్‌కు ఎందుకు పిలవలేదంటూ రచ్చ రచ్చ చేసింది. సిద్ధార్థ్ శుక్లా.. షెహ్నాజ్ గిల్‌లను ఆహ్వానించి.. తనను ఎందుకు ఆహ్వానించలేదని ఆమె ప్రశ్నించింది. తాను రాఖీని కాదని.. స్పైడర్-ఉమెన్ అని అంటూ రోడ్డు పై వినోదాత్మక చేష్టలతో అభిమానులను అలరించింది. తనకు బిగ్‌బాస్ షో అంటే చాలా ఇష్టమని చెబుతూ.. ఓటీటీ సీజన్‌లోకి తనను ఆహ్వానించకపోవడం బాధగా ఉందంటూ ఓ వీడియోని షేర్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ హాట్ బ్యూటీ వెనక కుక్కలు పడ్డాయి. అదేంటి అనుకుంటున్నారా..
రాఖీసావంత్ చేసిన రచ్చకు బిగ్ బాస్ వాళ్ళు దిగొచ్చారు. ఆమెను బిగ్ బాస్‌కి రమంటూ ఇన్విటేషన్ పంపారు. దాంతో ఈ బ్యూటీ నార్మల్ కంటే కాస్త ఎక్కువగానే రెడీ అయ్యి వెళ్ళింది. తన కారు దిగి సెట్‌కు వెళ్తున్న సమయంలో ఆమెను కొన్ని కుక్కలు వెంబడించాయి. చూడటానికే కాదు మోయడానికి కూడా కష్టం అనిపించే ఓ భారీ డ్రెస్‌తో రెడీ అయ్యి కొంచం హడావిడి చేసింది. దాంతో అక్కడ ఉన్న కుక్కలు ఆమె వెంటపడ్డాయి. అవి తనను ఎక్కడ కరుస్తాయో అన్న భయం ఉన్నా ఆ డ్రెస్ వేసుకుకొని పరిగెత్తలేక అలా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఆ తర్వాత మనకెందుకులే అనుకున్నాయో ఏమో కుక్కలు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఇదంతా అక్కడ ఉన్న తన స్నేహితులు వీడియో తీయగా దాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ హాట్ బాంబ్. ఇక ఈ వీడియో పై నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :