Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ పై సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?
'ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇప్పటికే ఓ సినిమా ఖరారు కాగా.. ఇదే నేపథ్యంతో మరో చిత్రం రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నో నిజ జీవిత సంఘటలను ధైర్యంగా తెరకెక్కించిన ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాను కూడా తెరకెక్కించనున్నాడు. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుంది.

బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నిజమైన సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో ఆయన సిద్ధ హస్తుడు. ‘ది తాష్కెంట్ ఫైల్స్’, ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘ది బెంగాల్ ఫైల్స్’, ‘ది వ్యాక్సిన్ వార్’, ‘ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు వివేక్. ఇప్పుడు ఆయన ఒక నిజమైన సంఘటన ఆధారంగా మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’ ఆధారంగా ఒక సినిమా తీస్తారని చెబుతున్నారు . కానీ ఆయన దీని గురించి అధికారిక ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్‌లో భారతీయ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఫలితంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’ అనే ఆపరేషన్‌ను ప్రారంభించింది. పాకిస్తానీ ఉగ్రవాదుల దాక్కున్న ప్రదేశాలపై భారత సైన్యం విస్తృతంగా దాడి చేసింది. ఇప్పుడు ఈ సంఘటనల ఆధారంగానే వివేక్ అగ్ని హోత్ని చిత్రం ఉంటుందని సమాచారం.
‘ఆపరేషన్ సిందూర్’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘టి సిరీస్’ నిర్మిస్తుంది. నిర్మాత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. వివేక్ అగ్నిహోత్రి ‘ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్’ కూడా నిర్మాణంలో చేతులు కలుపుతుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. T-సిరీస్ నుంచి కానీ, వివేక్ అగ్నిహోత్రి నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి, ఈ చిత్రంలో ఏ కళాకారులు నటిస్తారు? షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది వంటి సమాచారం కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేదు.
‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి భారీ విజయాన్ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన అతని సినిమాలు పెద్దగా ఆడలేదు. ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. ‘ది బెంగాల్ ఫైల్స్’ పై వివేక్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




