Kajol: ‘జీవితంలో కష్టమైన రోజులు.. బ్రేక్ కావాలి’.. వైరలవుతున్న హీరోయిన్ కాజోల్ ఇన్ స్టా పోస్ట్..
తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన వీఐపీ చిత్రంలో తొలిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించారు. అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఫాలోవర్లతో టచ్ లో ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకోవడమే కాకుండా.. వారి కామెంట్లకు కూడా రిప్లై ఇస్తుంటుంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది కాజోల్.
బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎవర్ గ్రీన్ హీరోయిన్లలో కాజోల్ దేవగన్ ఒకరు. 90వ దశకంలో హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా సత్తా చాటింది. 1992లో బేఖుతి సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత బాజీగర్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంకే, కుచ్ కుచ్ హోతా హై వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ సరసన అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికీ వీరిద్దరి జోడికి అత్యధికంగా అభిమానులు ఉన్నారు. స్టార్ హీరో అజయ్ దేవగన్‌ను వివాహం చేసుకున్న కాజోల్ చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన వీఐపీ చిత్రంలో తొలిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించారు. అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఫాలోవర్లతో టచ్ లో ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకోవడమే కాకుండా.. వారి కామెంట్లకు కూడా రిప్లై ఇస్తుంటుంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది కాజోల్.
ఇప్పటివరకు ఇన్ స్టాలో ఉన్న తన ఫోటోలను డిలీట్ చేసిన కాజోల్.. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. “ప్రస్తుతం జీవితంలో అత్యంక కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను” అంటూ ఓ ఫోటో షేర్ చేస్తూ.. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను అంటూ రాసుకొచ్చింది. అయితే కాజోల్ పెట్టిన పోస్ట్ పై నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఏమైందని ప్రశ్నిస్తుండగా.. మరికొందరు సినిమా ప్రమోషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం కాజోల్ ది గుడ్ వైఫ్ అనే సిరీస్ లో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ సుపాన్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆమె లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఇది కాజోల్ నటిస్తోన్న తొలి వెబ్ సిరీస్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.