Shah Rukh Khan: అత్యవసర చికిత్స కోసం అమెరికాకు షారుఖ్ ఖాన్.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఏమైందంటే?

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న సమయంలో అతను హీట్ స్ట్రోక్ బారిన పడ్డాడు. దీంతో షారుఖ్ ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి కుదట పడడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు కింగ్ ఖాన్. యథావిధిగా మళ్లీ తన రోజు వారీ కార్యకలాపాల్లో బిజీగా మారిపోయాడు. అయితే షారుఖ్ ఖాన్ ఇప్పుడు మళ్లీ ఆస్పత్రిలో చేరాడు.

Shah Rukh Khan: అత్యవసర చికిత్స కోసం అమెరికాకు షారుఖ్ ఖాన్.. ఆందోళనలో ఫ్యాన్స్..  ఏమైందంటే?
Shah Rukh Khan
Follow us

|

Updated on: Jul 30, 2024 | 6:35 PM

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న సమయంలో అతను హీట్ స్ట్రోక్ బారిన పడ్డాడు. దీంతో షారుఖ్ ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి కుదట పడడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు కింగ్ ఖాన్. యథావిధిగా మళ్లీ తన రోజు వారీ కార్యకలాపాల్లో బిజీగా మారిపోయాడు. అయితే షారుఖ్ ఖాన్ ఇప్పుడు మళ్లీ ఆస్పత్రిలో చేరాడు. అది కూడా అమెరికాలో. బాలీవుడ్ బాద్‌ షా చాలా ఏళ్లుగా కంటి సమస్య లతో బాధ పడుతున్నారు. ఈ కారణంగా ఆయన మంగళవారం (జూలై 30) అమెరికా వెళ్లారు. అక్కడే కంటి నిపుణుడి వద్ద కింగ్ ఖాన్ శస్త్ర చికిత్స చేయించుకోబోతున్నట్లు సమాచారం. అయితే ముంబైలో షారుఖ్‌కు అసలు ఏం జరిగిందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. కాగా ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు సహ యజమాని గా ఉన్నాడు. ఈ ఏడాది మేలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ చూస్తూ హీట్ స్ట్రోక్‌కు గురయ్యాడీ హీరో. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ కంటి సమస్యలతో షారుఖ్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే అతను మంగళవారం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం.

ఇక సినిమాల విషయానికి వస్తే.. షారుఖ్ ఖాన్ 2023లో హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ , ‘పఠాన్’ సినిమాలు రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరాయి. అలాగే రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ‘డంకీ’ సినిమా రూ. 400 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ‘కింగ్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు షారూఖ్. ఈ సినిమాలో ఆయన కూతురు సుహానా కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గురించి త్వరలో ఎలాంటి ప్రకటన వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని బాలీవుడ్ సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

షారుఖ్ ఖాన్ పేరు మీద గోల్డ్ కాయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.