AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jackie Shroff: ‘జై శ్రీరామ్‌’.. రామాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన ప్రముఖ నటుడు.. వీడియో చూశారా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ చారిత్రక ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి మహా సాధువులు, పండితులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు తరలి రానున్నారు. ఈ మహోత్తర ఘట్టంలో పలువురు సినీ ప్రముఖులు కూడా భాగం కానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌ చరణ్‌, ప్రభాస్‌ వంటి సూపర్‌ స్టార్స్‌ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు

Jackie Shroff: 'జై శ్రీరామ్‌'.. రామాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన ప్రముఖ నటుడు.. వీడియో చూశారా?
Actor Jackie Shroff
Basha Shek
|

Updated on: Jan 17, 2024 | 6:53 AM

Share

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. ఈనెల 22న జరిగే బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన వేడుక కోసం దేశ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మహాక్రతువు కోసం శ్రీరామ జన్మభూతి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ చారిత్రక ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి మహా సాధువులు, పండితులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు తరలి రానున్నారు. ఈ మహోత్తర ఘట్టంలో పలువురు సినీ ప్రముఖులు కూడా భాగం కానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌ చరణ్‌, ప్రభాస్‌ వంటి సూపర్‌ స్టార్స్‌ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. అలాగే పలువురు బాలీవుడ్‌ నటీనటులు కూడా పాల్గొననున్నారు. అయితే ఇంతలో ఒక సీనియర్‌ హీరోకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ప్రముఖ హిందీ నటుడు జాకీ ష్రాఫ్‌ తన సింప్లిసిటీని చాటుకున్నారు. సెలబ్రిటీ అన్న స్టేటస్‌ను పక్కన పెట్టి రామాలయ ప్రాంగణాన్ని, మెట్లను శుభ్రం చేశారు. 66 ఏళ్ల జాకీ ష్రాఫ్ ముంబైలో జరిగిన పురాతన రామాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి క్లీనింగ్‌ స్టాఫ్‌తో కలిసి రామాలయ ప్రాంగణం, మెట్లను శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు జాకీష్రాఫ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది శ్రీరామునిపై అతనికి ఉన్న భక్తిని చాటి చెప్పిందంటూ కొనియాడుతున్నారు.

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా వెలుగొందిన జాకీష్రాఫ్‌ తెలుగు వారికి కూడా సుపరిచితమే. పవన్‌ కల్యాణ్‌ పంజా, ఎన్టీఆర్‌ శక్తి, ప్రభాస్ సాహో, అస్త్రం, బ్యాంక్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌ తదితర సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించారు. తమిళ్‌, మలయాళ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటారు జాకీ ష్రాఫ్‌. నిరుపేద చిన్నారుల వైద్యం కోసం పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారీ సీనియర్‌ హీరో. ఇటీవలే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వానం అందుకున్నారు జాకీష్రాఫ్‌.

ఇవి కూడా చదవండి

రామాలయం మెట్లను శుభ్రం చేస్తోన్న జాకీష్రాఫ్.. వీడియో

అయోధ్య ఆహ్వానం అందుకుంటోన్న జాకీష్రాఫ్ దంపతులు..

View this post on Instagram

A post shared by Jackie Shroff (@apnabhidu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..