Vikram Bhatt: ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్‌తో నాకు సంబంధం ఉంది.. షాక్ ఇచ్చిన దర్శకుడు
మీటూ కేసులు కూడా ఎక్కువే. అక్రమ సంబంధాల ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి.. ఇప్పుడు ఓ సీనియర్ బాలీవుడ్ దర్శకుడు తనకు ఇద్దరు ప్రముఖ హీరోయిన్స్ తో అక్రమ సంబంధం ఉందని చెప్పి షాక్ ఇచ్చాడు. అంతే కాదు ఆ హీరోయిన్ల పేర్లు కూడా బయటపెట్టారు.
బాలీవుడ్‌లో లవ్వులు, డేటింగ్స్ లు , బ్రేకప్స్ చాలా కామన్. హీరో హీరోయిన్స్ ప్రతి ఆరు నెలలకోసారి బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌లను మారుస్తుంటారు. విడాకులు కూడా చాలా కామన్. మీటూ కేసులు కూడా ఎక్కువే. అక్రమ సంబంధాల ఆరోపణలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి.. ఇప్పుడు ఓ సీనియర్ బాలీవుడ్ దర్శకుడు తనకు ఇద్దరు ప్రముఖ హీరోయిన్స్ తో అక్రమ సంబంధం ఉందని చెప్పి షాక్ ఇచ్చాడు. అంతే కాదు ఆ హీరోయిన్ల పేర్లు కూడా బయటపెట్టారు.
‘గులాం’, ‘రాజ్’తో పాటు మరెన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన విక్రమ్ భట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రముఖ నటి, మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్, నటి అమీషా పటేల్‌తో తనకు అక్రమ సంబంధం ఉందని తెలిపాడు. విక్రమ్ భట్ తన చిరకాల స్నేహితురాలు అదితి భట్‌ని 1989లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. కానీ విక్రమ్ భట్, వివాహితుడైనప్పటికీ, 1990లో నటి సుస్మితా సేన్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. ఆ తర్వాత నటి అమీషా పటేల్‌తో కొన్నాళ్లుగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
జీవితంలో చాలా తప్పులు చేశాను కానీ, ఏ తప్పు చేసినా పశ్చాత్తాపపడను. నేను ప్రతి తప్పు నుండి నేర్చుకున్నాను. సుస్మితా సేన్‌తో నా రిలేషన్‌షిప్ వల్ల నా వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తాయి. దానికి పూర్తిగా నేనే బాధ్యుడిని. నేను ఎవరినీ నిందించను. అన్ని తప్పులకు నేనే బాధ్యుడిని. సుస్మిత, అమీషా ఇద్దరూ మంచివారే. ‘నా మాజీ భార్య కూడా’ అని విక్రమ్ భట్ అన్నారు.
‘నా జీవితంలో చాలా మంది మహిళలు వచ్చారు, వెళ్లారు. సుస్మిత, అమీషా పటేల్‌తో అతని సంబంధం చాలా చర్చనీయాంశమైంది. కానీ నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. వాళ్లంతా వచ్చి వెళ్లిపోయారు. నేను నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ఇది పరిపూర్ణ జీవితం అని నేను భావిస్తున్నాను. నా జీవితం అసంపూర్ణం కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు.