AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AR Rahman: ‘స్కామ్‌ 2023’.. ఏఆర్ రెహమాన్‌ మ్యూజికల్‌ కన్సర్ట్‌పై నెటిజన్ల మండిపాటు.. కారణమేంటంటే?

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌కు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో పోల్చితే తక్కువగా సినిమాలు చేస్తున్నా రెహ్మాన్‌ నిర్వహించే మ్యూజిక్‌ కన్సర్ట్స్‌, ఈవెంట్స్‌కు అభిమానులు పోటెత్తుతున్నారు. ఆయనను ఒక్కసారి చూస్తే చాలు అనుకునేవారు చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అలా మురుక్కమ్‌ నెంజన్‌ అనే పేరుతో చెన్నైలో ఓ సంగీత కచేరిని ఏర్పాటు చేశారు ఏ.ఆర్‌. రెహమాన్‌ .

AR Rahman: 'స్కామ్‌ 2023'.. ఏఆర్ రెహమాన్‌ మ్యూజికల్‌ కన్సర్ట్‌పై నెటిజన్ల మండిపాటు.. కారణమేంటంటే?
AR Rahman
Basha Shek
|

Updated on: Sep 11, 2023 | 12:39 PM

Share

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌కు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో పోల్చితే తక్కువగా సినిమాలు చేస్తున్నా రెహ్మాన్‌ నిర్వహించే మ్యూజిక్‌ కన్సర్ట్స్‌, ఈవెంట్స్‌కు అభిమానులు పోటెత్తుతున్నారు. ఆయనను ఒక్కసారి చూస్తే చాలు అనుకునేవారు చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అలా మురుక్కమ్‌ నెంజన్‌ అనే పేరుతో చెన్నైలో ఓ సంగీత కచేరిని ఏర్పాటు చేశారు ఏ.ఆర్‌. రెహమాన్‌ . సాధరణంగానే రెహ్మాన్‌ కన్సర్ట్స్‌, మ్యూజిక్‌ ఈవెంట్లకు ఇసుకేస్తే రాలనంత మంది అభిమానులు వస్తారు. అలాంటిది తన స్వస్థలం అంటే ఏ రేంజ్‌లో ఫ్యాన్స్ వస్తారో ఊహించడం చాలా కష్టం. అందుకు తగ్గట్టుగానే ఈవెంట్‌ టిక్కెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే వేలాది రూపాయలు వెచ్చింది తమ అభిమాన సంగీత దర్శకుడిని ప్రత్యక్షంగా చూడాలని కన్సర్ట్‌కు వెళ్లిన వారికి చేదు అనుభవం ఎదురైంది. టిక్కెట్లు ఉన్నప్పటికీ చాలామందిని లోపలికి అనుమతించలేదు. సీటింగ్‌ కెపాసిటీకి మించి టికెట్లు విక్రయించమే దీనికి కారణం. ప్రముఖ ఆర్గనైజర్‌ కంపెనీ ఏవీటీసి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మ్యూజికల్‌ కన్సర్ట్‌ టిక్కెట్లు లాభాల కోసం విక్రయించుకున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీట్లు లేకపోయినా పరిమితికి మించి టిక్కెట్లు అమ్మారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘మేం 2000 వేల రూపాయలు చెల్లించి టికెట్ కొన్నాం. కానీ లోపలికి అనుమతించలేదు’ అని కొందరు ట్వీట్ చేశారు. ‘ మ్యూజిక్‌ కన్సర్ట్‌ చాలా దారుణంగా ప్లాన్ చేశారు. మా డబ్బు, శ్రమ అన్నీ వృథా అవుతాయి’ మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు. ‘రెహమాన్ ఇచ్చిన చెత్త ప్రోగ్రామ్ ఇది. ఈ కన్సర్ట్‌తో 30 ఏళ్లుగా రెహమాన్‌పై నాకున్న అభిమానం ఈరోజు చచ్చిపోయింది’ అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీఐపీ జోన్ టికెట్ ధర ఒక్కోదానికి రూ. 250 వేల నుంచి రూ. 50 వేల వరకు విక్రయించారు. టికెట్లు కొన్న వారికి కనీసం సెక్యూరిటీ లేదు. వీఐపీ జోన్‌ లో కూర్చున్న వారికి కనీసం స్టేజీ కూడా సరిగా కనిపించలేదు. కనీసం బౌన్సర్లను కూడా ఏర్పాటు చేయలేదు. ఎవరుపడితే వాళ్లు వీఐపీ జోన్ లోకి వచ్చేస్తున్నారు. ఇంత చెత్త మ్యూజికల్ కాన్సర్ట్ నేను ఎప్పుడూ చూడలేదు. ఇదొక స్కామ్‌ 2023’ అని నెటిజన్లు రెహమాన్‌, ఈవెంట్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. ప్రస్తుతం తమిళనాడు అంతా రెహమాన్‌ మ్యూజికల్‌ కన్సర్ట్‌ గురించే చర్చ జరుగుతోంది. మరి ఈ రగడపై ఈవెంట్‌ నిర్వాహకులు, ఏఆర్ రెహమాన్ ఏమంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి

రెహమాన్ మ్యూజికల్ కన్సర్ట్ లో తొక్కిసలాట

అభిమానుల తీవ్ర ఆగ్రహం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.