War 2 Movie: యుద్దానికి సిద్ధం అవుతున్న తారక్, హృతిక్.. త్వరలో సెట్స్ పైకి వార్ 2..
ఒక సినిమాలో ఇద్దరు హీరోలుంటే, కంపేరిజన్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందులోనూ ఇప్పుడున్న ట్రెండ్‌లో నార్త్ వర్సెస్ సౌత్ అనే మాటకు అసలు తిరుగులేదు. నార్త్ నుంచి హృతిక్ రోషన్, సౌత్ నుంచి తారక్ నటిస్తున్న వార్2 మీద ఇన్‌స్టంట్‌గా క్రేజ్ పెరగడానికి రీజన్ కూడా అదే. మొన్న మొన్నటిదాకా ఫైటర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు హృతిక్ రోషన్. ఇప్పుడు ఫైటర్ షూటింగ్ కంప్లీట్ అయింది. మన దగ్గర దేవర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు తారక్. ఈ సినిమాలో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించాలనుకుంటున్న అండర్‌వాటర్ సీక్వెన్స్ కోసం స్పెషల్‌గా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




