- Telugu News Photo Gallery Cinema photos Star Heroine Rakul Preet Singh Movies in Multi languages in Tollywood film industry Telugu Actress photos
Rakul Preet Singh: ఎక్కువ మల్టీ లాంగ్వేజ్ ల్లో రకుల్ సినిమాలు.. ట్రేండింగ్ లో సిల్వర్ స్క్రీన్ భ్రమరాంబ..
రకుల్ ప్రీత్‌సింగ్... ఒకప్పుడు మన దగ్గర స్టార్ హీరోలు ఎవరు సినిమా చేసినా, హీరోయిన్ల లిస్టులో వినిపించే పేరు. కానీ కొన్నాళ్లుగా ఈమె గురించి ఊసే లేదు. సౌత్‌ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు రకుల్. మనందరిలో ఇలాంటి ఫీలింగ్ ఉంటే, రకుల్ చెబుతున్న మాటలు ఇంకోలా ఉన్నాయి. ఇంతకీ ఏంటవి.? మన సిల్వర్ స్క్రీన్ భ్రమరాంబ రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలేంటి? అని ఆరా తీస్తే.. తెలుగులో ఒక్కటి కూడా కనిపించదు.
Updated on: Sep 11, 2023 | 1:33 PM

రకుల్ ప్రీత్‌సింగ్... ఒకప్పుడు మన దగ్గర స్టార్ హీరోలు ఎవరు సినిమా చేసినా, హీరోయిన్ల లిస్టులో వినిపించే పేరు. కానీ కొన్నాళ్లుగా ఈమె గురించి ఊసే లేదు. సౌత్‌ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు రకుల్. మనందరిలో ఇలాంటి ఫీలింగ్ ఉంటే, రకుల్ చెబుతున్న మాటలు ఇంకోలా ఉన్నాయి. ఇంతకీ ఏంటవి.?

మన సిల్వర్ స్క్రీన్ భ్రమరాంబ రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలేంటి? అని ఆరా తీస్తే.. తెలుగులో ఒక్కటి కూడా కనిపించదు. పోనీ అని సౌత్‌కి స్పాన్ పెంచి చూస్తే తమిళంలో ఇండియన్2 కనిపిస్తోంది. శివకార్తికేయన్ తో అయలన్ అని ఓ సినిమా ఉంది.

నార్త్ లో మాత్రం అడపాదడపా సినిమాలున్నాయి ఈ బ్యూటీ చేతిలో. వాటిలో ఐ లవ్యూ, మేరీ పత్ని కా రీమేక్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. ఛత్రీవాలి, భూ తరహా సినిమాలతో మంచి పేరు సొంతం చేసుకున్నారు రకుల్.

ఏ ఒక్క భాషకో పరిమితం కాకపోవడం తన అదృష్టమని అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. రకరకాల భాషల్లో సినిమాలు చేయడం వల్ల, అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు మాత్రమే కాదు, వర్కింగ్ స్టైల్ కూడా తెలుసుకునే అవకాశం కలుగుతోందని అంటున్నారు రకుల్.

తన సినిమాలను చూసేటప్పుడు రకరకాల ప్రాంతాలకు చెందినవారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఎప్పుడూ ఉంటుందని చెప్పారు మిస్ బ్యూటీ.

ఎప్పుడూ ఫిట్‌నెస్ గురించి మాట్లాడే రకుల్ ప్రీత్ సింగ్, ఇలా లాంగ్వేజెస్, ఆపర్‌చ్యూనిటీస్, ఫ్యాన్స్ గురించి మాట్లాడటం కొత్తగా అనిపిస్తోందని అంటున్నారు నెటిజన్లు.




