సలార్ సినిమా వాయిదా పడిందనే వార్త కన్నా, నవంబర్‌లో మంచి డేట్‌ని చూసుకుంటోందనే మాట ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. అందుకే ఐఎండీబీ మోస్ట్ ఎవెయిటెడ్ మూవీస్ లిస్టులోనూ ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అవుతోంది సలార్ సినిమా. ప్రభాస్ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా ఫస్ట్ చాప్టర్ కోసం జనాలు ఈగర్‌గానే వెయిట్ చేస్తున్నారు. కేజీయఫ్ తర్వాత ప్రశాంత్‌నీల్ చేస్తున్న సినిమా కావడంతో క్రజ్ అమాంతం పెరిగింది.