- Telugu News Photo Gallery Cinema photos Tollywood Star Heroines ready to move multiple acting in film industry Telugu actress Photos
Actress: ప్యాన్ ఇండియా రేంజ్‌లో కలిసిపోతున్న వేళ.. ఆలోచిస్తున్న టాలీవుడ్ గ్లామర్ గర్ల్స్..
ప్యాన్ ఇండియా రేంజ్‌లో అందరూ కలిసిపోతున్న వేళ.. ముంబై ఫ్లైట్ ఎక్కడానికి ఆలోచిస్తున్న గ్లామర్ గర్ల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు హిందీ జనాలు. మా దగ్గర అంతా బాగానే ఉంటుంది. మీరు ధైర్యంగా ఫార్వర్డ్ మార్చ్ చేయొచ్చు అని ప్రోత్సహిస్తున్నారు. అయినా అందాల భామలు ఆలోచిస్తున్నారంటే.. విషయం ఏమై ఉంటుంది.? లేడీ పవర్‌స్టార్ అనే పేరు తెచ్చుకున్నారు రౌడీబేబీ సాయిపల్లవి..
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Ravi Kiran
Updated on: Sep 11, 2023 | 1:30 PM

ప్యాన్ ఇండియా రేంజ్‌లో అందరూ కలిసిపోతున్న వేళ.. ముంబై ఫ్లైట్ ఎక్కడానికి ఆలోచిస్తున్న గ్లామర్ గర్ల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు హిందీ జనాలు. మా దగ్గర అంతా బాగానే ఉంటుంది. మీరు ధైర్యంగా ఫార్వర్డ్ మార్చ్ చేయొచ్చు అని ప్రోత్సహిస్తున్నారు. అయినా అందాల భామలు ఆలోచిస్తున్నారంటే... విషయం ఏమై ఉంటుంది.?

లేడీ పవర్‌స్టార్ అనే పేరు తెచ్చుకున్నారు రౌడీబేబీ సాయిపల్లవి. పెర్ఫార్మెన్సులతోనూ, డ్యాన్సులతోనూ అదరగొడుతున్నారు. అయినా నార్త్ సైడ్ మాత్రం కాన్‌సెన్‌ట్రేట్ చేయడం లేదు. పల్లవి బాలీవుడ్ మూవీ చేయబోతున్నారు. మేకోవర్ అవుతున్నారు. అందుకే ఆమె సౌత్ సినిమాలు సైన్ చేయడం లేదంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి. అలాంటిదేమీ లేదని ఆమె రీసెంట్ మూవీ అనౌన్స్ మెంట్ తేల్చేసింది.

సౌత్‌లో స్టార్ హీరోయిన్ సమంత కూడా నార్త్ లో ఇప్పటిదాకా మూవీ చేయలేదు. ఆల్రెడీ చేసిన ఫ్యామిలీ మేన్2, ఇప్పుడు చేస్తున్న సిటాడెల్ కూడా వెబ్ సీరీస్‌లే. పక్కా కమర్షియల్ మూవీలో సామ్‌ని చూడాలని క్యూరియస్‌గా ఉన్నారు బాలీవుడ్ జనాలు. దీనికి సామ్ దగ్గర ఎలాంటి ఆన్సర్ ఉందో లెట్స్ వెయిట్ అండ్ సీ.

ఓకే చెప్పినట్టే చెప్పి మైదాన్ నుంచి తప్పుకున్నారు మహానటి కీర్తీ సురేష్. నేషనల్ అవార్డు విన్నర్ కీర్తీ నెక్స్ట్ బాలీవుడ్ ఎంట్రీ మైదాన్‌తో ఉంటుందని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఇప్పటిదాకా హిందీ సినిమా గురించి చడీచప్పుడూ లేదు.

సౌత్ హీరోయిన్లలో అనుష్క అంటే తనకు అభిమానమని ఆ మధ్య స్టేట్‌మెంట్ ఇచ్చారు రణ్‌బీర్ కపూర్. బాహుబలిలో దేవసేనగా ఉత్తరాది జనాల మెప్పు పొందిన అనుష్క ఎందుకో బాలీవుడ్ మీద ఎప్పుడూ సీరియస్‌గా ఫోకస్ చేయలేదు. నియర్ ఫ్యూచర్‌లో అయినా హిందీ ప్రాజెక్టులకు సైన్ చేస్తే చూడాలన్నది ముంబై వాలాల కోరిక.





























