Akshay Kumar: కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ హీరో.. అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్..
Akshay Kumar Hospitalized: కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుకుంటోంది. మొన్నటి వరకు శాతించిన వైరస్ ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇక కరోనా బారిన పడుతోన్న...
Akshay Kumar Hospitalized: కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుకుంటోంది. మొన్నటి వరకు శాతించిన వైరస్ ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇక కరోనా బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి సినీ తారలు వచ్చి చేరుతున్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగా వివిధ ప్రాంతాలకు వెళ్తుండడంతో సినీ తారలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానుల్లో కాస్త ఆందోళన మొదలైంది. దీంతో ఈ విషయమై అక్షయ్ అధికారికంగా స్పందించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆస్పత్రిలో చేరానని అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. ఈమేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు, మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞుడినై ఉంటాను. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరాను. అతి త్వరలో క్షేమంగా ఇంటికి చేరుకుంటానని ఆశిస్తున్నాను. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి’ అంటూ రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ ఆదివారం ఉదయం తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్, ఆలియాభట్, రణ్‌బీర్‌కపూర్, కార్తిక్ ఆర్యన్‌తోపాటు పలువురు తారలు కరోనా బారిన పడ్డారు.
అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్..
— Akshay Kumar (@akshaykumar) April 5, 2021
Also Read: Republic Movie Teaser: ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో..లేదా అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం’.. రిపబ్లిక్ టీజర్
Corona Cases India: భారత్‌లో మళ్లీ పడగ విప్పిన కరోనా.. ఒక్క రోజులో లక్ష కేసులు.. యూఎస్ తర్వాత.!
తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 1,097 మందికి పాజిటివ్, ఆరుగురు మృతి