Rashmika Mandanna Birthday: దక్షిణాది క్రేజీ హీరోయిన్ .. కన్నడ సోయగం రష్మిక మందన్నా పుట్టిన రోజు నేడు..

శాండల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్నా .. పుట్టిన రోజు నేడు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది రష్మిక. మోడలింగ్ రంగంలో నుంచి .. కిర్రాక్ పార్టీ కన్నడ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టింది..

Rashmika Mandanna Birthday: దక్షిణాది క్రేజీ హీరోయిన్ .. కన్నడ సోయగం రష్మిక మందన్నా పుట్టిన రోజు నేడు..
Rashmika Mandanna
Follow us
Surya Kala

|

Updated on: Apr 05, 2021 | 12:46 PM

Rashmika Mandanna Birthday: శాండల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్నా .. పుట్టిన రోజు నేడు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది రష్మిక. మోడలింగ్ రంగంలో నుంచి .. కిర్రాక్ పార్టీ కన్నడ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టింది. కన్నడ, తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా సుల్తాన్ సినిమాతో కోలీవుడ్ లో అడుగు పెట్టింది. మరోవైపు బాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి కూడా రెడీ అయ్యింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రష్మిక. సోషల్ మీడియా వేదికగా సినిమాలతో సహా అనేక విషయాలను పంచుకుంటుంది రష్మిక.

కార్తీ హీరోగా నటించిన సుల్తాన్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. పక్కా పల్లెటూరి యువతిగా తన నటనతో ఆకట్టుకుంది. ఇక తాజాగా రష్మిక మందన పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఇంకా చెప్పాలంటే దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో రష్మిక హవా నడుస్తుందని చెప్పాలి. ఓ వైపు విజయదేవర కొండ, నితిన్, నాగశౌర్య వంటి యంగ్ హీరోలతో నటిస్తూనే.. మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన జోడీ కట్టే ఛాన్స్ కొట్టేసింది. దీంతో టాలీవుడ్ లో క్రీజీ హీరోయిన్ గా మారింది రష్మిక మందన్న.

కర్ణాటక లోని కొడుగు జిల్లా విరాజ్ పేట్‌‌లో 1996 ఏప్రిల్ 6న రష్మిక మందన్న జన్మించింది. తల్లిదండ్రులు సుమన్ , మదన్ మందన్న. జర్నలిజం అండ్ సైకాలజీ తో డిగ్రీ పట్టాపుచ్చుకుంది. అనేక యాడ్స్ లో నటించిన రష్మిక 2016 న కన్నడ సినిమా కిర్రాక్ పార్టీ తో తెరంగ్రేటం చేసింది. ఇక తెలుగులో నాగ శౌర్య కు జోడీగా ఛలో సినిమాతో అడుగు పెట్టింది. గీతగోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్ అయ్యింది. దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాల్లో నటించి.. తన అందం, అభినయంతో కుర్రకారు కలల రాణి అయ్యింది. ఇప్పటికే కోలీవుడ్ లో అడుగు పెట్టిన రష్మిక తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక అల్లు అర్జున్ నటిస్తున్న యాక్షన్ మరియు రొమాంటిక్ డ్రామా పుష్పాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.  అనేక క్రేజ్ ఆఫర్స్ తో కెరీర్ లో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా కు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలుపుతుంది టీవీ9.

Also Read: Video Viral: శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు భక్తితో ఉడుత ప్రదక్షణలు.. వీడియో వైరల్

వెన్నముక పని తీరు మెరుగుపరిచి.. ఛాతిని ధృడంగా చేసే యోగాసనం ఏమిటో తెలుసా..!