Ardha Chakrasana: వెన్నముక పని తీరు మెరుగుపరిచి.. ఛాతిని ధృడంగా చేసే యోగాసనం ఏమిటో తెలుసా..!

Ardha Chakrasana: యోగా చాలా ఉపయోగకరమైన మరియు ఆరోగ్యకరమైన వ్యాయామం. ఈ యోగా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి, మెదడుకు, మనస్సుకు చాలా మంచిది. యోగా తో శరీరానికి కొత్త శక్తి వస్తుంది. యోగా వల్ల చాలా రకాల..

Ardha Chakrasana: వెన్నముక పని తీరు మెరుగుపరిచి.. ఛాతిని ధృడంగా చేసే యోగాసనం ఏమిటో తెలుసా..!
Ardha Chakrasana
Follow us
Surya Kala

|

Updated on: Apr 05, 2021 | 11:41 AM

Ardha Chakrasana: యోగా చాలా ఉపయోగకరమైన మరియు ఆరోగ్యకరమైన వ్యాయామం. ఈ యోగా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి, మెదడుకు, మనస్సుకు చాలా మంచిది. యోగా తో శరీరానికి కొత్త శక్తి వస్తుంది. యోగా వల్ల చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలున్నాయి వ్యాధులతో పోరాడటానికి ఈ యోగా.. వ్యాయామ రూపంలో పురాతన కాలం నుంచే భారతదేశంలో ప్రారంభమైనది. ఈ యోగా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచి, శరీరం ఫిట్ గా ఉండటానికి బాగా సహాయపడుతుంది. అయితే ఒకొక్క యోగాసనం ఒకొక్క ప్రాధాన్యతను కలిగి ఉండి ప్రయోజనం ఇస్తుంది. ఈరోజు దృఢమైన ఛాతి కోసం వేసే అర్ధ చక్రాసనం యోగాసనం గురించి తెలుసుకుందాం..!

ఈ ఆసనాన్ని వేయు పద్దతి:

* మెుదటగా రెండు కాళ్లు కలిపి నిటారుగు నిలబడాలి. * రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. * గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. *అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. *నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. *చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. *ఇలా 8 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకూ చేయాలి

అర్ధ చక్రాసనం వల్ల ఉపయోగాలు:

*ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. *నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం మంచి ఫలితాలను ఇస్తుంది. *వెన్నముక పనితీరుని మెరుగు పరుస్తుంది. *మెడభాగం కూడా సాగినట్లువుతుంది. *ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది.

గమనిక : ఈ ఆసనాన్ని తీవ్రమైన హిప్ లేదా వెన్నెముక సమస్యలు ఉన్నవారు వేయకూడదు. అంతేకాదు అధిక రక్తపోటు , మెదడు రుగ్మతలున్నవారు కూడా ఈ ఆసనానికి దూరంగా ఉండాలి. అల్సర్, హెర్నియా రోగులు ఈ యోగాసనాన్నీ వేయరాదు. ఇక గర్భిణీ స్త్రీలు కూడా అర్ధ చక్రాసనానికి దూరంగా ఉండాలి.

Also Read: కార్తీక్ కోసం డెవిల్ ప్లాన్ వేసిన మోనిత… దీపని , పిల్లలని ఇంటికి తీసుకొచ్చిన డాక్టర్ బాబు.. ట్విస్ట్ ఏమిటంటే..!

ప్రముఖ మలయాళ నటుడు పి. బాలచంద్రన్ అనారోగ్యంతో మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు