Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam Serial: కార్తీక్ కోసం డెవిల్ ప్లాన్ వేసిన మోనిత… దీపని , పిల్లలని ఇంటికి తీసుకొచ్చిన డాక్టర్ బాబు.. ట్విస్ట్ ఏమిటంటే..!

Karthika Deepam Serial: రోజు రోజుకీ ట్విస్ట్ తో ఆసక్తిగా సాగుతున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1005 ఎపిసోడ్ లో అడుగు పెట్టింది. కార్తీక్.. దీప తో ఉన్న సంగతి చూసిన మోనిత ... పిల్లల పేదరికాన్ని చూసి తట్టుకోలేక పోతున్న డాక్టర్ బాబు.. ఈ నేపథ్యంలో..

Karthika Deepam Serial: కార్తీక్ కోసం డెవిల్ ప్లాన్ వేసిన మోనిత... దీపని , పిల్లలని ఇంటికి తీసుకొచ్చిన డాక్టర్ బాబు.. ట్విస్ట్ ఏమిటంటే..!
Karthika Deepam
Follow us
Surya Kala

|

Updated on: Apr 06, 2021 | 9:09 AM

Karthika Deepam Serial: రోజు రోజుకీ ట్విస్ట్ తో ఆసక్తిగా సాగుతున్న కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1005 ఎపిసోడ్ లో అడుగు పెట్టింది. కార్తీక్.. దీప తో ఉన్న సంగతి చూసిన మోనిత … పిల్లల పేదరికాన్ని చూసి తట్టుకోలేక పోతున్న డాక్టర్ బాబు.. ఈ నేపథ్యంలో ఈ రోజు సీరియల్ లోని హైలెట్స్ చూద్దాం..!

నేను పిల్లల తో ఎప్పుడు పనిచేయించాలని అనుకోలేదు.. నేను గుమస్తా కూతురుని..మీరు డాక్టర్ బాబు కూతుర్లు అని చెబుతూనే ఉంటా అంటుంది దీప. కావాలంటే పిల్లలని అడగమనండి అంటుంది.. ఇక మురళీ కృష్ణ కలుగజేసుకుని కార్తీక్ కి దీప కి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు.

ఎంతకాలం ఇక్కడ ఉండాలని అనుకుంటున్నారు.. లేక ఆస్థి మొత్తం మీ చిన్నకూతురు పిల్లాడికి ఇవ్వాలని కోరుకుంటున్నారా అని అడుగుతాడు. లేదు బాబు మీరు కోటీశ్వరుడు.. కోట్లు ఇవ్వగలరు.. కానీ ఆ కోట్లు కోరుకోలేని పిచ్చిది నా కూతురు.. మీరు శాసిస్తేనే కదా పొట్ట చేతపట్టుకుని మీరు ఎవరో తెలియని ఊరుకు వచ్చి… ఊడిగం చేసుకుని బతుకుతుంది. ఇంకా నా కూతురులో తప్పులు పట్టుకుని వెదికేటంత ఆవేశం ఎందుకొస్తుందో అర్ధం కాకా మౌనంగా ఉన్న బాబు అంటాడు. మురళీ కృష్ణ. దీంతో కార్తీక్ మురళీ కృష్ణ మీద విరుచుకుపడతాడు.. మీ పని ఏంటి..? మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు.. ఇక్కడే ఉండిపోతారా.. మా అమ్మ మీకు డబ్బులిచ్చి ఎందుకు పంపింది.. అని అంటూ మండిపడతాడు. మీకు దీప కనిపించిన వెంటనే కోడలు కోసం మనవరాళ్లు కోసం బెంగ పెట్టుకున్న మా అమ్మకు ఎందుకు చెప్పలేదు.. మీ కూతురు నెత్తిమీద చెయ్యి వేసి ఒట్టు వేశాన్నంటారు.. మీరు ఎపుడు ఇంతేనా .. చెప్పాల్సింది చెప్పకుండా దాచి పెడతారా..? అలా చేసే కదా మా కథని భాగ్యనగరం నుంచి .. విజయనగరం వరకూ తరిమికొట్టారు.. అని కోపంతో ప్రశ్నిస్తాడు.

నాకు ఎలాంటి ఆశలేదు.. అత్తిల్లు ఆదరించకపోతే.. పుట్టిల్లు ఆదరించాలి.. ఇద్దరి ఆదరణ లేకుండా బతుకుతున్న నాకూతురు ఎలా బతుకుతుందో అని ఉండిపోయాను.. అని అంటే ఎంత కాలం బతకాలని అనుకుంటాడు. అని ప్రశ్నిస్తే.. మీరు వచ్చే వరకూ .. మీ మనసు మారే వరకూ.. నా అదృష్టమో.. దీప అదృష్టమో.. ఆ రోజు ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు..’ అంటాడు మురళీ కృష్ణ సంతోషంగా.

ఆపండి.. అలాంటి కలలు కనకండి.. ఆరోజు ఇప్పుడు వచ్చిందని ఎవరు చెప్పారు.. నేను మీ అమ్మాయిని తీసుకుని వెళ్తానని అని ఎవరు చెప్పారు.. అలా తీసుకుని వెళ్ళేవాడిని ఐతే.. అసలు బయటకు వెళ్లనిచ్చేవాడినే కాదుగా అంటాడు కార్తీక్. ఇంతలో పిల్లలు రావడంతో.. పిల్లల్ని దగ్గరకు తీసుకుని.. మీ అమ్మయి చాలా నీరసంగా కనిపిస్తోంది. రెస్ట్ తీసుకోమనండి. అని చెప్పి.. పిల్లలతో రండిరా ఆకలి వేస్తుంది. మనం బయట తినేసి.. వీళ్ళకి పార్సిల్ తీసుకొద్దాం అంటాడు..పిలల్లని తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు.. అప్పుడు మురళీ కృష్ణ బాధగా అయన ఉద్దేశము ఏమిటమ్మా.. అంటే.. నాకు అర్ధం కావట్లేదు నాన్న.. మనసులో ఎదో పెట్టుకుని వేరేదో మాట్లాడుతున్నారు. అంటుంది దీప,

మరోవైపు మోనిత .. కార్తీక్ దీపపిల్లలతో కలిసి ఉంది గుర్తు తెచ్చుకుని రగిలిపోతుంది. నన్ను ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు.. నువ్వు కూడా అవకాశవాదివి అయ్యిపోయావు.. నీకు తెలియదు.. చీటర్ లయర్ .. పిలల్ల కోసం మరీ అంతగా దిగజారిడిపోతాడని అనుకోలేదు. నువ్వు మాములు మగవాడివి అనిపించుకున్నావ్.. కానీ మోనిత మాములు ఆడది కాదు.. నాకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తా ..నువ్వు అవకాశవాడివి అయిపోవు కార్తీక్.. నువ్వు ఇలా రంగులు మార్చిన రోజు ఏం చెయ్యాలో నాకు అందుకు ముందే ప్లాం ఉంది. నాకు ముందే ప్లాన్ ఉంది. అందుకే అందుకే నేను ఆ పని చేశాను.. రెండు నెలలు రెండు నెలలు ఆగు.. జెస్ట్ వితిన్ టూ మంత్స్. జస్ట్ నువ్వు కళ్లు తిరిగి నా కాళ్ల మీద పడతావ్. అని అంటుంది మోనిత..

ఇక సౌందర్య ఆనందరావు లు ఎదో ఆలోచిస్తుంటే.. శ్రావ్య భోజనానికి పిలుస్తుంది. ఇద్దరూ ఆకలి లేదు అంటారు.. అప్పుడు ఆదిత్య వచ్చి ఏమైంది అని అడుగుతాడు.. మీరు ఎం చేస్తారు.. వదిన భజన చేస్తారా..? అన్నయ్య భజన చేస్తారా అని ప్రశ్నిస్తాడు.. వాళ్లిదరికి మీ ఇద్దరి ఎమోషన్స్ తో పనిలేదు.. మీరు ఎం చేస్తారు.. మీ సంగతి మీరు చూసుకోవచ్చు కదా అని అంటాడు ఆదిత్య.. దీంతో సౌందర్య అవును సౌం దాని సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోదు.. ఈ స్టుపిడ్ సన్ నిర్ణయాలు మార్చుకోడు.. ఎన్నాళ్లని చెబుతాం.. ఎన్నేళ్లని చెబుతాం.. పదండీ భోజనం చేద్దాం..అంటుంది.. అందరూ .. తినడానికి వెళ్తుంటారు.. సౌందర్య ఇంతలో గుమ్మం వైపు చూసి షాక్ తింటుంది.

ఆదిత్య రా మమ్మి అంటాడు.. సౌందర్య చూసిన వైపు అందరూ చూసి సంతోషంతో కన్నీరు పెట్టుకుంటారు. సౌందర్య పిల్లలని దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది. మన కుటుంబం మొత్తం ఉంది.. కళ్లారా చూసుకోండి ఆనందరావు గారు అంటుంది సౌందర్య.. ఆదిత్య థాంక్స్ అంటాడు.. చూడడండి డాక్టర్ బాబు వెళ్లి.. వంటలక్కని తీసుకొచ్చాడు. ఓ సెల్ఫ్ రెస్పెక్ట్.. ఓ స్టుపిడ్ ఇద్దరూ కలిసి వచ్చారు అని ఆనందంగా అంటుంది. హిమనీ శౌర్య ని ప్రేమగా దగ్గరకి తీసుకుంటుంది. దీపని ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. కార్తీక్ పిల్లల్ని ప్రెష్ అవ్వమని పైకి పంపిస్తాడు.. సంతోష పడుతున్న సౌందర్య తో నేను భార్యని తీసుకుని రాలేదు మమ్మీ.. నీ కోడలి తీసుకొచ్చాను అంటూ.. సౌందర్య చేతిలో దీప చేతిని పెడతాడు.. అందరూ షాక్ తింటారు,, మరి దీప నిర్ణయం ఏమిటి..? మోనిత ఏమి చేసింది చూడాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే..!

Also Read: P Balachandran Died: ప్రముఖ మలయాళ నటుడు పి. బాలచంద్రన్ అనారోగ్యంతో మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు