AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిల్లర రూపంలో జీతాలు.. గగ్గోలు పెడుతున్న ఉద్యోగులు.. ఎక్కడంటే..

బృహన్‌ ముంబయి ఎలక్ట్రిసిటీ సఫ్లై అండ్‌ ట్రాన్స్‌పోర్టు(బెస్ట్‌)సంస్థలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇటీవల బెస్ట్‌ సంస్థ ఉద్యోగుల పర్సు బరువు విపరీతంగా పెరిగింది.

చిల్లర రూపంలో జీతాలు.. గగ్గోలు పెడుతున్న ఉద్యోగులు.. ఎక్కడంటే..
Rupee Coins
Rajeev Rayala
|

Updated on: Apr 05, 2021 | 11:43 AM

Share

బృహన్‌ ముంబయి ఎలక్ట్రిసిటీ సఫ్లై అండ్‌ ట్రాన్స్‌పోర్టు(బెస్ట్‌)సంస్థలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇటీవల బెస్ట్‌ సంస్థ ఉద్యోగుల పర్సు బరువు విపరీతంగా పెరిగింది. అంటే వారికి శాలరీలు పెరిగాయని కాదు. జీతాలే చిల్లర రూపంలో ఇస్తున్నారట. ఈ సంస్థ ఉద్యోగులు గత కొన్ని నెలలుగా చిల్లర రూపంలో జీతాలు పొందుతున్నారు. కొన్ని నెలల కిందటి వరకు ఈ సంస్థ ఉద్యోగులకు వారి బ్యాంకు అకౌంట్లలోనే జీతాలు పడేవి. కానీ ఇప్పుడు వారి వేతనాలను చిల్లర రూపంలో డైరెక్ట్‌గా చేతికి అందిస్తున్నారు.

అయితే ఈ విచిత్ర పరిస్థితికి అసలు కారణమేంటంటే.. బెస్ట్‌ సంస్థకు వచ్చిన చిల్లరను తీసుకోవడానికి కొన్ని బ్యాంకులు నిరాకరించడమేనని ఆ సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే ఈ సంస్థలో 40 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బెస్ట్‌ సంస్థ దాదాపు 4 వేల బస్సులను నడపడమే కాకుండా.. 10 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్‌ సరఫరాను అందిస్తోంది. ప్రయాణికుల టికెట్లు, విద్యుత్తు వినియోగదారులు చెల్లించే బిల్లుల్లో చిల్లర డబ్బులు ఎక్కువగా ఉంటోంది. బ్యాంకులు ఆ చిల్లరను తీసుకోవడానికి నిరాకరిస్తుండటంతో చేసేది లేక తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనంగా చిల్లర నాణేలు ఇవ్వాలని బెస్ట్‌ సంస్థ యాజమాన్యం నిర్ణయించింది.

కాగా, వచ్చే జీతంలో సగం మొత్తం చిల్లర రూపంలో వస్తున్న కారణంగా.. ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని బెస్ట్‌ సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే జీతాలు ఇచ్చినప్పుడల్లా నాణాల సంచీ చేతిలో పట్టుకొని ఇళ్లకు వెళ్లడం సురక్షితం కాదని ఉద్యోగులు అంటున్నారు. అయితే చిల్లరను డిపాజిట్‌ చేసేందుకు జనవరిలో ఓ ప్రైవేట్‌ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నప్పటికీ..పలు కారణాలతో అది కార్యరూపం దాల్చడం లేదని అధికారులు తెలిపారు. జీతాన్ని నాణేల రూపంలో ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ‘బెస్ట్‌’ ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

జల్లికట్టులో అపశ్రుతి.. కానిస్టేబుల్ ను కొమ్ములతో కుమ్మిన ఎద్దు.. పరిస్థితి విషమం

Friends: స్నేహితులుగా మారిన బద్ద శత్రువులు.. వైరల్ గా మారిన వీడియో

Follow Us
రక్తం, కాలేయాన్ని క్లీన్ చేసే తాటి బెల్లం.. పంచదార బదులు వాడితే
రక్తం, కాలేయాన్ని క్లీన్ చేసే తాటి బెల్లం.. పంచదార బదులు వాడితే
తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే
తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే
Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు..
Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు..
మహారాణి గెటప్‌లో జబర్దస్త్ నటి.. ఫొటోస్ వైరల్.. గుర్తు పట్టారా?
మహారాణి గెటప్‌లో జబర్దస్త్ నటి.. ఫొటోస్ వైరల్.. గుర్తు పట్టారా?
ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్..
ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్..
Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు
Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు
స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!
స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!
తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రకంపనలు.. గడవులోపు లెక్కలు తేలేనా?
తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రకంపనలు.. గడవులోపు లెక్కలు తేలేనా?
అసలు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? 99 శాతం మందికి ఇది తెలియదు
అసలు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? 99 శాతం మందికి ఇది తెలియదు
మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించండి
మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించండి