Friends: స్నేహితులుగా మారిన బద్ద శత్రువులు.. వైరల్ గా మారిన వీడియో

"స్నేహాం' వర్ణించటానికి పదాలు లేని ఓ గొప్ప వరం..స్నేహానికి ఉన్న గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలుకానిదే...!

Friends: స్నేహితులుగా మారిన బద్ద శత్రువులు.. వైరల్ గా మారిన వీడియో
Friendship
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 05, 2021 | 8:26 AM

Friends: “స్నేహాం’ వర్ణించటానికి పదాలు లేని ఓ గొప్ప వరం..స్నేహానికి ఉన్న గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలుకానిదే…! కుల మతాలు, ఆస్తి అంతస్తులు చూడనిది. ఒక్కోసారి స్నేహంలో జాతి విభేదాలు కూడా కనిపించవు. బద్ధ శత్రువులు కూడా చాలా సందర్బాల్లో స్నేహితులుగా మారిన ఘటనలు చూశాం..ఇది కూడా అలాంటిదే..

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ముగ్గురు మిత్రుల్ని చూడండి…సాధారణంగా కోడిపిల్లలు కనిపిస్తే..కుక్కలు వెంటపడి చంపేస్తాయి. అలాగే కుందేలు కూడా అంతే..కుందేలు ఎదురుపడితే…కుక్క దాన్ని అస్సలు విడిచిపెట్టదు. వేటాడి మరీ చంపేస్తుంది. కానీ, విచిత్రంగా ఇక్కడ ఈ మూడు మంచి మిత్రులు.

అంతపెద్ద శునకం చూడండి..బుల్లి కుందేలును ఎలా దగ్గర తీసుకుందో…తన రెండు ముందు కాళ్ల మధ్యలో కుందేలును భద్రంగా పడుకోబెట్టుకుని సైన్యంలా కాపాడుతున్నట్లుగా ఉంది. ఒక్కదగ్గర కుదురుగా ఉండలేని కోడిపిల్లను కూడా ఆ కుక్క ఇలా కంటి చూపుతో రక్షిస్తోంది. వైరం మర్చి స్నేహం చేస్తున్న ఈ మూగజీవాలను చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. నెట్టింట్లో వైరల్‌గా మారిన చక్కర్లు కొడుతున్న ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్‌, వేలల్లో కామెంట్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నువ్వెంట్రా ఇలా ఉన్నావ్..? నీ తోకేంట్రా..? చింపాంజీ ఫన్నీ వీడియో వైరల్

రైతన్నలను ముప్పుతిప్పలు పెడుతున్న ఎలుకలు.. గగ్గోలు పెడుతున్న అన్నదాతలు