జల్లికట్టులో అపశ్రుతి.. కానిస్టేబుల్ ను కొమ్ములతో కుమ్మిన ఎద్దు.. పరిస్థితి విషమం

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Apr 05, 2021 | 8:45 AM

జాలికట్టు లో అపశ్రుతి. కానిస్టేబుల్ ను కొమ్ములతో కుమ్మిన ఎద్దు. చిత్తూరు బైరెడ్డి పల్లి లో జల్లికట్టు నిర్వహించారు. ఈ జల్లికట్టుకు భారీగా ప్రజలు పాల్గొన్నారు.

జల్లికట్టులో అపశ్రుతి.. కానిస్టేబుల్ ను కొమ్ములతో కుమ్మిన ఎద్దు.. పరిస్థితి విషమం
Jallikattu

జాలికట్టు లో అపశ్రుతి. కానిస్టేబుల్ ను కొమ్ములతో కుమ్మిన ఎద్దు. చిత్తూరు బైరెడ్డి పల్లి లో జల్లికట్టు నిర్వహించారు. ఈ జల్లికట్టుకు భారీగా ప్రజలు పాల్గొన్నారు. జనాలు ఎక్కువగా ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు ఈ క్రమంలో ఓ ఎద్దు పోలీసులపైకి దూసుకు వచ్చింది. అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ ను దాని కొమ్ములతో కుమ్మింది. దాంతో అమాంతం అతడు గాలిలోకి ఎగిరిపడ్డాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. తమిళ్ నాడు ఎన్నికల సందర్భంగా జల్లికట్టుపై కోర్టు నిషేధం విధించింది. దాంతో చిత్తూరు జల్లికట్టుకు తమిళనాడు వాసులు భారీగా పాల్గొన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Friends: స్నేహితులుగా మారిన బద్ద శత్రువులు.. వైరల్ గా మారిన వీడియో

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపికబురు చెప్పిన థమన్ వీడియో..

ఆటాడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు పయనమయ్యారు.. చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu