దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి కలవరం.. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌‌తో దేశీయ మార్కెట్ల భారీ పతనం

దేశంలో రోజు వారి కరోనా కేసులు లక్ష దాటుతుండటంతో మరోసారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతోంది. సోమవారం అరంభంతోనే దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి.

  • Balaraju Goud
  • Publish Date - 11:08 am, Mon, 5 April 21
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి కలవరం.. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌‌తో దేశీయ మార్కెట్ల భారీ పతనం
Stock Market

Sensex today news : దేశంలో రోజు వారి కరోనా కేసులు లక్ష దాటుతుండటంతో మరోసారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతోంది. సోమవారం అరంభంతోనే దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంతకేతాలతో తోడు, దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ, లాక్‌డౌన్‌ విధిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో సోమవారం కలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్ ఏకంగా 1,100కు పైగా పాయింట్లను కోల్పోయింది. 50,020 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10.30 గంటలకు 1,162 పాయింట్లు కోల్పోయింది. ఇక, 14,837 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ ఉయదం 10.30 గంటల సమయానికి 319 పాయింట్లు కోల్పోయింది.. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాన్ని చవిచూశాయి. విప్రో, బ్రిటానియా, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌, బజాజ్‌ఆటో, యాక్సిస్‌, ఎస్బీఐ బ్యాంకు భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. త్రైమాసిక నాలుగు లో 14 శాతం నికర లాభాలు పుంజుకున్న నేపథ్యంలో సెయిల్‌ మాత్రం భారీ లాభాల బాటలో పయనిస్తోంది. సుమారు 5 శాతంలాభాలతో కొనసాగుతోంది.

కరోనా సెకండ్‌వేవ్‌ ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి క్రమంపటిష్టంగానే ఉందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ నోమురా తెలిపింది. అయితే, లాక్‌డౌన్‌, పెరిగిన ఆంక్షల నేపథ్యంలో క్యూ 2 జీడీపీని ప్రభావితం చేయనుందని హెచ్చరించింది. మరోవైపు, దేశంలో కరోనా కేసులు రికార్డ్‌ స్థాయిలో నమోదవుతూ మరింత ఆందోళన రేపుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో లక్షకుపైగా కేసులు నమోదైనాయి. 1,03,558 కొత్త కేసులు, 478 మరణాలు తాజాగా నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమవడం, పలు రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌లు అమలవుతుండడం వంటి కారణాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Read Also… 

 LG Smart Phones: మూతపడిన ఎల్జీ స్మార్ట్ ఫోన్ డివిజన్..నష్టాలతో మార్కెట్ల నుంచి కనుమరుగవుతున్నపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్!

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు.. ముస్తాబవుతున్న భాగ్యనగరం.