Studds Helmet: ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే నింజా ఎలైట్‌ సూపర్‌ డి5 హెల్మెట్‌ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌

Ninja Elite Super D5 Decor: భారతదేశంలో ప్రముఖ హెల్మెట్‌, యాక్ససరీస్‌ తయారీదారు స్టడ్స్‌ ఇటీవల కొత్త నింజా ఎలైట్‌ సూపర్‌ డి5 డెకర్‌ హెల్మెట్‌ మోడల్‌ను దేశీయ...

Studds Helmet: ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే నింజా ఎలైట్‌ సూపర్‌ డి5 హెల్మెట్‌ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌
Ninja Elite Super D5 Decor Helmet
Follow us
Subhash Goud

|

Updated on: Apr 05, 2021 | 10:20 AM

Ninja Elite Super D5 Decor: భారతదేశంలో ప్రముఖ హెల్మెట్‌, యాక్ససరీస్‌ తయారీదారు స్టడ్స్‌ ఇటీవల కొత్త నింజా ఎలైట్‌ సూపర్‌ డి5 డెకర్‌ హెల్మెట్‌ మోడల్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. స్టడ్స్‌ విడుదల చేసిన ఈ కొత్త హెల్మెట్‌ ధర రూ.1595. స్టడ్స్‌ నింజా ఎలైట్‌ సూపర్‌ డి5 డెకర్‌ బ్రాండ్‌ ఫ్లిప్‌ అఫ్‌ఫుల్‌ ఫేస్‌ హెల్మెట్‌. ఈ కొత్త హెల్మెట్‌ 2 వేర్వేరు ఫినిషింగ్‌ ఆప్షన్‌లలో లభిస్తుంది. అంతే కాకుండా ఇందులో 10 వేర్వేరు కలర్‌లలో ఉంటాయి. మల్టిఫుల్‌ కలర్‌ ఆప్షన్స్‌తో పాటు కంపెనీ మల్టిఫుల్‌ సైజులో వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేలా తయారు చేశారు.

కొత్తగా విడుదలైన నింజా ఎలైట్‌ సూపర్‌ డి 5 డెకర్‌ హెల్మెట్‌ హై-ఇంపాక్ట్‌ రెసిస్టెంట్‌ డిజైన్‌ ఉందని కంపెనీ తెలిపింది. అలాగే ఈ హెల్మెట్‌ ద్వారా ముఖానికి, తలకు ఎంతో రక్షణగా ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే తలకు ఏ మాత్రం హాని జరుగకుండా పటిష్టంగా ఉండేలా ఈ హెల్మెట్‌ను తయారు చేశారు. అంతేకాదు ఈ హెల్మెట్‌ వాతావరణం నుంచి కూడా మంచి రక్షణ కల్పిస్తుంది. హెల్మెట్‌ ధరించినా.. మంచి గాలి వచ్చేలా ఉంటుంది. అలాగే నిరంతరం ఉపయోగించడంతో తలెత్తే అలెర్జీలు, ఇన్ఫెక్షన్ల నుంచి ఈ హెల్మెట్‌ రక్షిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ హెల్మెట్‌ వేర్వేరు కలర్లలో లభ్యమవుతుంది. ఇందులో ఒక ఫ్లిప్‌-అఫ్‌ ఫేస్‌ హెల్మెట్‌, యూవీరసిస్టెంట్‌ పెయింట్‌, రెగ్యులేటెడ్‌ డెన్సిటీ ఐపీఎస్‌, హైపో ఆలెర్జెనిక్‌ లైనర్‌,ఫాస్ట్‌ రిలీజ్‌ చైన్‌ స్ట్రాపా, చైన్‌ ఎయిర్‌ వెంట్స్‌, ఎయిర్‌ ఎగ్జాస్‌ వంటి లక్షణాలు ఉన్నాయి.

కొత్త నింజా ఎలైట్ సూపర్ డి 5 డెకర్ సౌకర్యవంతమైన లోపలి పాడింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది అధిక-నాణ్యత ఫాబ్రిక్‌తో రూపొందించబడి ఉంటుంది. ఇది వివిధ చర్మ రోగాల నుంచి రక్షిస్తుంది కూడా. ఈ హెల్మెట్‌ వివిధ రకాల సైజుల్లో లభ్యమవుతుంది. కాస్త ధర ఎక్కువైనా.. తలకు రక్షణతో పాటు గాలి, ఆరోగ్యం విషయంలో తలెత్తె ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ చదవండి: SBI offer: మీకు ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా..? మీకో బంపర్‌ ఆఫర్‌.. ఈ ఐదు ఆఫర్లు మీకోసమే.. ఏప్రిల్‌ 7వ తేదీ వరకు అవకాశం

Gold Price: బంగారం ధర మరోసారి రూ.50 వేలకు చేరనుందా..? మార్కెట్లో జోరందుకున్న ఊహాగానాలు..!

Gas Cylinder Booking: పేటీఎం బంపర్‌ ఆఫర్‌… కేవలం రూ.61కే గ్యాస్‌ సిలిండర్‌… ఎలాగంటే..!

Royal Enfield Bike: బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.50 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ బైక్.. ఏ మోడల్‌ అంటే..