Gas Cylinder Booking: పేటీఎం బంపర్‌ ఆఫర్‌… కేవలం రూ.61కే గ్యాస్‌ సిలిండర్‌… ఎలాగంటే..!

Gas Cylinder Booking Offer: గ్యాస్‌ సిలిండర్‌ ధరలు దూసుకుపోతున్నాయి. విపరీతంగా ధర పెరిగిపోవడంతో సామాన్యుడికి భారంగా మారుతోంది. ప్రతి రోజు వాడుకునే ఈ గ్యాస్...

Gas Cylinder Booking: పేటీఎం బంపర్‌ ఆఫర్‌... కేవలం రూ.61కే గ్యాస్‌ సిలిండర్‌... ఎలాగంటే..!
Gas Cylinder Booking
Follow us

|

Updated on: Apr 04, 2021 | 9:07 AM

Gas Cylinder Booking Offer: గ్యాస్‌ సిలిండర్‌ ధరలు దూసుకుపోతున్నాయి. విపరీతంగా ధర పెరిగిపోవడంతో సామాన్యుడికి భారంగా మారుతోంది. ప్రతి రోజు వాడుకునే ఈ గ్యాస్‌ సిలిండర్‌ను ఎంత ధర పెరిగినా కొనితీరాల్సిందే. పెరిగిన ధరలతో గ్యాస్‌ను బుక్‌ చేసుకోవాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో ఇబ్బందులు పడుతుండగా, ఈ గ్యాస్‌ ధరలు మరిన్ని చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ. 861కి చేరింది. కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక మంది సామాన్యులు ఇంత ధర పెట్టి సిలిండర్ ను బుక్ చేయడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది.

అయితే సిలిండర్‌ ధరలను తగ్గించాలని ఇప్పటికే ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో డిమాండ్‌ ఎదురవుతున్నా… ఆయా గ్యాస్‌ కంపెనీల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

ఇదిలా ఉండగా, ప్రముఖ పేమెంట్స్‌ యాప్‌ పేటీఎం (Paytm) గ్యాస్‌ వినియోగదారులకు మంచి శుభవార్త వినిపించింది. గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌పై ఏకంగా రూ.800 వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది. అంటే ఈ లెక్కన కేవలం రూ.61లకే గ్యాస్‌ సిలిండర్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

క్యాష్‌బ్యాక్‌ ఎలా పొందాలంటే..

► ముందుగా మీరు మీ మొబైల్‌ ఫోన్‌లో పేటీఎం యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉండాలి.

► అనంతరం రీఛార్జ్‌ అండ్‌ పే బిల్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత బుక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ఆప్షన్‌లోకి వెళ్లాలి.

► అక్కడ మీరు మీ గ్యాస్‌ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి.

► అనంతరం మీ ఐడీ లేదా మొబైల్‌ నెంబర్‌ను నమోదు చేసి గ్యాస్‌ బుకింగ్‌ చేసుకోవాలి.

► బుక్‌ చేసిన 24 గంటల్లో మీకు క్యాష్‌బ్యాక్‌ స్క్రాచ్‌ కార్డ్‌ వస్తుంది.

► దీని ద్వారా మీకు రూ.800 వరకు క్యాష్‌బ్యాక్‌ వస్తుంది.

► ఈ స్క్రాచ్‌ కార్డ్‌లో రూ.10 నుంచి రూ.800 వరకు ఉంటుంది.

►అయితే ఇంకో విషయం ఏంటంటే పేటీఎం నుంచి మొదటిసారిగా గ్యాస్‌ బుకింగ్‌ చేసుకున్న వారికే ఈ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.ఈ ఆఫర్‌ ఈ ఏప్రిల్‌ 30వ తేదీ వరకు ఉంటుందని పేటీఎం సంస్థ వెల్లడించింది.

ఇవీ చదవండి: Top Smartmobiles: ఏప్రిల్‌ నెలలో భారత్‌లో విడుదల కానున్న టాప్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

Royal Enfield Bike: బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.50 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ బైక్.. ఏ మోడల్‌ అంటే..

Honda Vehicles Recalls : ఏకంగా 7,61,000 వాహనాలు వెనక్కి రప్పించిన హోండా కంపెనీ.. కారణం ఏమిటంటే..?

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..