SBI vs Post Office: పోస్టాఫీస్..ఎస్బీఐ డిపాజిట్ చేయాలంటే ఏది బెస్ట్? తాజా ఇంట్రస్ట్ రేట్స్ ఇవే!

కష్టపడి సంపాదించిన సొమ్మును దాచుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే, ఎక్కడ దాచుకోవాలనే విషయంలో ఎప్పుడూ తికమక ఎదురవుతూనే ఉంటుంది.

SBI vs Post Office: పోస్టాఫీస్..ఎస్బీఐ డిపాజిట్ చేయాలంటే ఏది బెస్ట్? తాజా ఇంట్రస్ట్ రేట్స్ ఇవే!
Sbi Vs Post Office
Follow us
Anil kumar poka

|

Updated on: Apr 04, 2021 | 7:36 AM

SBI vs Post Office: కష్టపడి సంపాదించిన సొమ్మును దాచుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే, ఎక్కడ దాచుకోవాలనే విషయంలో ఎప్పుడూ తికమక ఎదురవుతూనే ఉంటుంది. ఎక్కువ వడ్డీ వస్తుంది కదా అని ప్రయివేట్ సంస్థల్లో మదుపు చేస్తే ఆ సొమ్ముకు  భద్రత ఉండదు. మరి ప్రభుత్వ రంగ సంస్థల్లో సేవింగ్స్ చేయాలంటే వడ్డీ రేట్లు తక్కువ ఉంటాయి.. పైగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంటాయి. రిస్క్ లేకుండా డబ్బులను దాచుకోవాలనుకునేవారు వడ్డీరేట్లు తక్కువైనా ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ లేదా పోస్టాఫీస్ ల్లో డిపాజిట్ చేస్తారు.

ఎస్బీఐ లేదా పోస్టాఫీస్ రెండూ తమ ఖాతాదారుల కోసం అనేక రకాలైన డిపాజిట్ స్కీమ్ లు అందుబాటులో ఉంచాయి. రెండు చోట్లా డిపాజిట్ సొమ్ముకు వేర్వేరు వడ్డీరేట్లు అమలులో ఉంటాయి. ఇవి కూడా ప్రభుత్వ విధానాలను అనుసరించి ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఈ ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన సందర్భంగా ఇటు పోస్టాఫీస్ అటు ఎస్బీఐ లలో డిపాజిట్ లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

పోస్టాఫీసుల్లో డిపాజిట్ల పై వడ్డీ రేట్లు ఇలా..

పోస్టాఫీసుల్లో టర్మ్ డిపాజిట్ స్కీమ్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ దాదాపు ఒకటే. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొద్దిగా మారాయి.

  • ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకూ టర్మ్ డిపాజిట్లపై 5.5% వడ్డీ రేట్లు ప్రస్తుతం పోస్టాఫీసులు అందిస్తున్నాయి.
  • ఐదు సంవత్సరాల టర్మ్ డిపాజిట్ల పై పోస్టాఫీసులో 6.7% వడ్డీ లభిస్తుంది.

ఇక ఎస్బీఐ లో డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇలా..

జనవరి 8, 2021 నుంచి ఎస్బీఐలో అమలులో ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం..

  • 46 రోజుల వ్యవధి నుంచి 179 రోజుల వ్యవధి ఉన్న టర్మ్ డిపాజిట్లపై 3.9% వడ్డీ లభిస్తుంది.
  • ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల కంటే తక్కువ సమయానికి డిపాజిట్ చేస్తే 5% వడ్డీ రేటు ఎస్బీఐ ఆఫర్ చేస్తోంది.
  • రెండేళ్లకు పైబడి మూడేళ్ళ లోపు డిపాజిట్లపై 5.1% వడ్డీరేటు ఎస్బీఐ ఇస్తోంది.
  • మూడేళ్లకు మించి ఐదేళ్ల లోపు టర్మ్ డిపాజిట్లపై ఎస్బీఐ లో 5.3% వడ్డీరేటు దొరుకుతుంది.
  • ఇక ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు డిపాజిట్ చేస్తే ఎస్బీఐ 5.4% వడ్డీరేటు ఇస్తుంది.

తమ సొమ్మును భద్రపరుచుకోవాలని భావించే వారికి పోస్టాఫీస్, ఎస్బీఐ రెండూ సురక్షితమైనవే. ఇవి అందించే వడ్డీరేట్లు బేరీజు వేసుకుని.. అవసరాలకు అనుగుణంగా ఉన్న డిపాజిట్ కాలపరిమితి ఎంచుకుని డబ్బులను సేవ్ చేసుకోవచ్చు.

Also Read: ECLGS Scheme : ఈసీఎల్జీఎస్ పథకం గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం.. మరో మూడు నెలలు అవకాశం..

మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఆనంద్ మహీంద్రా.. ‘రూపాయికే ఇడ్లీ’ అందించిన బామ్మ కమలాత్తాళ్‌కు సొంతిల్లు