ECLGS Scheme : ఈసీఎల్జీఎస్ పథకం గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం.. మరో మూడు నెలలు అవకాశం..
ECLG Scheme : కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న వ్యాపారాలను ప్రోత్సహించేందుకు కేంద్రం తెచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం
ECLG Scheme : కరోనా మహమ్మారి వల్ల దెబ్బతిన్న వ్యాపారాలను ప్రోత్సహించేందుకు కేంద్రం తెచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం(ఈసీఎల్‌జీఎస్) కోసం దరఖాస్తు చేసుకునేందుకు మూడు నెలలు పొడిగించింది. ఈ పథకం ద్వారా వ్యాపార రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. దీన్ని ఇప్పుడు జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం 3.0ను తీసుకొచ్చింది.
దీని ద్వారా ఇప్పటికే ఇస్తున్న రంగాలతో పాటు హాస్పిటాలిటీ, ట్రావెల్, టూరిజం రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్న వారికీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేక విండోనో ఓపెన్ చేసింది. ఈసీఎల్జీఎస్ 3.0 కింద మంజూరు చేసిన రుణాల వ్యవధి 2 సంవత్సరాలు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్స్ దరఖాస్తు గడువును 2021 జూన్ 30 వరకు పొడిగించింది. అర్హత గల వ్యాపారులు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద రూ.3,00,000 కోట్ల రుణాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఒకవేళ గడువులోగా లక్ష్యాన్ని చేరుకుంటే అప్లికేషన్ విండో క్లోజ్ అవుతుంది.