Facebook Frames : వ్యాక్సినేషన్ కోసంఫేస్‌బుక్ సరికొత్త ప్రచారం.. న్యూ ప్రొఫైల్ ఫ్రేమ్స్, స్టిక్కర్స్‌తో అవేర్‌నెస్..
Facebook Frames : ప్రపంచ దేశాలు కరోనా భారిన పడి విలవిల లాడుతున్నాయి. గత సంవత్సరం మొత్తం తన ప్రభావాన్ని చూపి తగ్గినట్టే తగ్గి మళ్లీ రెండో దశ స్టార్ట్ చేసింది.
Facebook Frames : ప్రపంచ దేశాలు కరోనా భారిన పడి విలవిల లాడుతున్నాయి. గత సంవత్సరం మొత్తం తన ప్రభావాన్ని చూపి తగ్గినట్టే తగ్గి మళ్లీ రెండో దశ స్టార్ట్ చేసింది. దీంతో ప్రజలందరు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే భారతదేశంలో జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ మొదలు పెట్టారు. తాజాగా 45 ఏళ్లకు పైబడిన వారికి కూడా టీకా ఇవ్వడం ఇటీవలే ప్రారంభించగా, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు టీకా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘వ్యాక్సినేషన్’ ప్రొగ్రామ్‌ను మరింత ప్రొత్సహించడానికి ‘ఫేస్‌బుక్’ న్యూ ప్రొఫైల్ ఫ్రేమ్స్, స్టిక్కర్స్ తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా ‘ఐ గాట్ మై కొవిడ్ 19 వ్యాక్సినేషన్, లెట్స్ గెట్ వ్యాక్సినేటెడ్, వి కెన్ డూ దిస్’ అనే కోట్స్‌తో ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి. న్యూస్ ఫీడ్‌లో కొవిడ్ -19 వ్యాక్సిన్ ఫ్రేమ్‌లను ఉపయోగిస్తున్న వ్యక్తుల సారాంశాన్ని కూడా ఫేస్‌బుక్ చూపిస్తుంది. ఫేస్‌బుక్‌లో 25శాతం మంది ఇప్పటికే ఈ కొత్త ప్రొఫైల్ ఫ్రేమ్‌ను ఉపయోగిస్తున్నారని ఎఫ్‌బీ తెలిపింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యుమన్ సర్వీసెస్ (హెచ్‌హెచ్‌ఎస్), సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) భాగస్వామ్యంతో ఫేస్‌బుక్ ఈ ఫీచర్స్ రిలీజ్ చేసింది.
‘కొత్త ఫ్రేమ్‌లు కొవిడ్-19 (COVID-19) వ్యాక్సిన్లకు మద్దతును పంచుకునేందుకు మనల్ని అనుమతిస్తాయని ఫేస్‌బుక్ అఫీషియల్ బ్లాగులో తెలిపింది. జాతీయ, ప్రపంచ ఆరోగ్య అధికారులతో కలిసి పనిచేయడం ద్వారా ప్రజలను త్వరగా చేరుకోవడంతో పాటు నమ్మకం కూడా పెరుగుతోందని తెలిపింది.