Triphallia: వైద్య చరిత్రలోనే తొలిసారిగా.. మూడు పురుషాంగాలతో జన్మించిన శిశువు.. ఎక్కడంటే..?

Baby born with three Penises: వైద్య చరిత్రలోనే తొలిసారిగా అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని విని వైద్యులే షాక్ అవుతున్నారు. సాధారణంగా పురుషులకు ఒకే పురుషాంగం ఉంటుంది. కానీ

Triphallia: వైద్య చరిత్రలోనే తొలిసారిగా.. మూడు పురుషాంగాలతో జన్మించిన శిశువు.. ఎక్కడంటే..?
Baby Born With Three Penises
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 04, 2021 | 5:23 AM

Baby born with three Penises: వైద్య చరిత్రలోనే తొలిసారిగా అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని విని వైద్యులే షాక్ అవుతున్నారు. సాధారణంగా పురుషులకు ఒకే పురుషాంగం ఉంటుంది. కానీ ఓ శిశువు మూడు పురుషాంగాలతో జన్మించాడు. ఈ అరుదైన సంఘటన ఇరాక్‌లో జరిగింది. దుహాక్‌కు చెందిన ఓ మహిళ ఇటీవలనే ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే మూడు నెలలు అనంతరం ఆ బిడ్డకు స్క్రోటమ్‌లో వాపు రావడంతో తల్లిదండ్రులు బాగ్దాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. తీరా డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించన అనంతరం ఆ పిల్లవాడికి రెండు కంటే ఎక్కువ పురుషాంగాలు ఉన్నాయని గుర్తించారు. ఇది వైద్య చరిత్రలోనే మొట్టమొదటి సంఘటన అంటూ వైద్యులు ప్రకటించారు.

ఆ పిల్లవాడికి ప్రధాన పురుషాంగం ఒకటి రాగా.. దాని పక్కనే ఇంకొకటి పరుషాంగం వచ్చింది. మరొకటి స్క్రోటమ్ కింద ఉన్నట్టు డాక్టర్లు పేర్కొన్నారు. ఇది చాలా వింతగా ఉందంటూ పేర్కొన్నారు. అయితే దీని కోసం పూర్తిగా స్టడీ చేశారు. ఆ పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి డ్రగ్స్ కూడా తీసుకోలేదని జెనిటిక్ పరంగా కూడా ఎలాంటి సమస్య తలెత్తలేదని వివరించారు. పుట్టినప్పుడు ఒకే పురుషాంగం ఉందని వివరించారు. ఈ కేసు గురించి ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ’లో వివరించారు. షకీర్ సలీమ్ జబాలి, అయాద్ అహ్మద్ మహమ్మద్ ఈ ఆర్టికల్‌ను రాశారు. ఒక వ్యక్తికి మూడు అంగాలు ఉండటాన్ని ట్రిఫాలియా అంటారు.

పిల్లవాడికి మూడు పురుషాంగాలు ఎలా వచ్చాయో అనేది ఇప్పటి వరకు ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ప్రతి 50, 60 లక్షల మంది ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన సమస్య ఉద్భవిస్తుంది. బహుశా ప్రపంచంలోనే ఇది మొట్ట మొదటి కేసు కావచ్చు అంటూ వారు అధ్యయనంలో వెల్లడించారు. అయితే.. బాలుడిలో అదనంగా ఏర్పడిన పురుషాంగాల్లో మూత్రనాళం లేదని వైద్యులు తెలిపారు. ఆ రెండు పురుషాంగాలను ఆపరేషన్ చేసి తొలగించినట్లు వెల్లడించారు. ఒక వ్యక్తికి మూడు పురుషాంగాలు ఉండడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి అని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీలో పేర్కొన్నారు.

అయితే.. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ కేస్‌‌లో ఇది తొలిసారి జరిగినట్లు పేర్కొన్నారు. కానీ.. 2015లోనే ఇండియాలో మూడు అంగాలతో ఓ బాలుడు జన్మించినట్లు డైలీ మెయిల్ పేర్కొంది. అయితే ఆ వివరాలేవీ మెడికల్ జర్నల్‌లో రికార్డు కాకపోవడంతో.. ఇది తొలి కేసుగా నమోదైంది.

Also Read: