Shocking Video: జూలు విదిల్చిన సింహం.. అడవి పందిని వెంటాడింది. కట్ చేస్తే.!
Messy lion gets his paws: అడవిలో నియమాలు అన్నీ భిన్నంగా ఉంటాయి. జంతువులు ఏవైనా సరే చురుకుదనంతో ఉంటూ.. వేరే జంతువుల...
Messy lion gets his paws: అడవిలో నియమాలు అన్నీ భిన్నంగా ఉంటాయి. జంతువులు ఏవైనా సరే చురుకుదనంతో ఉంటూ.. వేరే జంతువుల నుంచి తమను తాము రక్షించుకుంటాయి. ఇక తమ ఆహారం కోసం ఎరను వేటాడేటప్పుడు ప్రతీ జంతువు ఖచ్చితంగా వ్యూహం రచిస్తాయి. ఇక మృగరాజు విషయానికి వస్తే మాత్రం దండయాత్ర.. ఎరగా ఎంచుకున్న జంతువు ఎక్కడ నక్కి ఉన్నా కూడా వెంటాడి.. వేటాడుతుంది. తాజాగా ఓ సింహం తన ఎర కోసం ఏకంగా ఏడు గంటల పాటు శ్రమించి.. వెంటాడి.. వేటాడింది. భూమిలో నక్కినా కూడా వెలికి తీసి మరీ సింహం చంపేసింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కెన్యాలోని నైరూబీ మసాయి మరా జాతీయ పార్కులో ఓ సింహం తన ఆహారం కోసం వేటను సాగిస్తోంది. ఆఫ్రికన్ పందులు భూమిలో దాగి ఉండటాన్ని సింహం గుర్తించింది. తీవ్ర ఆకలితో ఉన్న ఆ సింహం.. సుమారు ఏడు గంటల పాటు గుంతను తవ్వి ఆఫ్రికన్ జాతి అడవి పందిని బయటికి తీసి పట్టుకుంది. ఆ పంది సింహం బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. సింహం ఉడుంపట్టు ముందు పంది ఓడిపోయింది. ఈ సుదీర్ఘ పోరాటంలో మృగరాజు గెలిచింది. ఆకలి తీర్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు విపరీతంగా రీ-ట్వీట్లతో పాటు కామెంట్స్ చేస్తున్నారు.