Covid-19 Vaccine: వామ్మో.. ఫోన్ మాట్లాడుతూ.. ఒకేసారి రెండు కరోనా వ్యాక్సిన్లు వేసిన నర్సు.. ఎక్కడంటే?
Corona Vaccine Doses: ఫోన్ చేతిలో ఉంటే చాలా మంది లోకాన్నే మరిచిపోతుంటారు. ఆ ధ్యాసలో పడి ఏదేదో చేసి చివరకు ఇరుక్కుపోతుంటారు. అందుకే ఉద్యోగులు విధులు నిర్వర్తించేటప్పుడు ఫోన్లకు దూరంగా ఉండాలంటూ
Woman – Corona Vaccine Doses: ఫోన్ చేతిలో ఉంటే చాలా మంది లోకాన్నే మరిచిపోతుంటారు. ఆ ధ్యాసలో పడి ఏదేదో చేసి చివరకు ఇరుక్కుపోతుంటారు. అందుకే ఉద్యోగులు విధులు నిర్వర్తించేటప్పుడు ఫోన్లకు దూరంగా ఉండాలంటూ ప్రభుత్వాలు సైతం సూచిస్తుంటాయి. అయితే తాజాగా.. ఒక నర్సు మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ.. ఆమె చేసే పనినే మరిచిపోయింది. కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన మహిళకు ఒకేసారి రెండు టీకాలను వేసింది. ఈ సంఘట ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో జరిగింది. దేహత్ జిల్లా అక్బర్ పూర్ ప్రాంతానికి చెందిన 50ఏళ్ల కమలేష్ కుమారి.. కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు గురువారం మాండౌరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఈ క్రమంలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం అర్చన.. ఫోన్ మాట్లాడుతూ.. కమలేష్ కుమారికి ఒకసారి రెండు కరోనా టీకాలను వేసింది.
వెంటనే కమలేష్ కుమారి తనకు రెండు టీకాలు ఎందుకు వేశావని నర్సును ప్రశ్నించింది. ఈ పొరపాటుకు నర్సు క్షమాపణలు చెప్పకపోగా.. తననే తప్పుపట్టిందని కమలేష్ కుమారి పేర్కొంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపగా.. వారొచ్చి ఆరోగ్య కేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మాత్రం నిలకడగా ఉందని.. ఇంజక్షన్ వేసిన ప్రాంతంలో వాపు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా.. ఈ సంఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీఎంవో ఆదేశించిందని జిల్లా మేజిస్ట్రేట్ జితేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ కేసులో శనివారం సాయంత్రం వరకు నివేదికలను సేకరించి నర్సుకు సమన్లు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. దర్యాప్తు నివేదిక వచ్చేంత వరకు నర్సును విధుల నుంచి దూరంగా ఉంచామన్నారు. అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Also Read: