AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడవిలో అలజడి.. తుపాకుల మోత.. ఎత్తుకు పై ఎత్తు.. ఫలితంగా ఎన్‌కౌంటర్లు.. అసలేం జరుగుతుంది..?

Wandering Maoist Forces : పచ్చని అడవుల్లో మళ్లీ తుపాకుల మోత దద్దరిల్లుతోంది.. గత కొన్ని రోజులుగా మావోయిస్టు దళాల సంచారంతో సరిహద్దు ప్రాంతాలు

అడవిలో అలజడి.. తుపాకుల మోత.. ఎత్తుకు పై ఎత్తు.. ఫలితంగా ఎన్‌కౌంటర్లు.. అసలేం జరుగుతుంది..?
Wandering Maoist Forces
uppula Raju
|

Updated on: Apr 03, 2021 | 9:21 PM

Share

Wandering Maoist Forces : పచ్చని అడవుల్లో మళ్లీ తుపాకుల మోత దద్దరిల్లుతోంది.. గత కొన్ని రోజులుగా మావోయిస్టు దళాల సంచారంతో సరిహద్దు ప్రాంతాలు వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది.. తాజాగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లతో మళ్లీ రక్తపాతం మొదలైంది. దీంతో సామాన్య ప్రజలు భయం గుప్పిట్లో బతుకు వెళ్లదీస్తున్నారు.మావోయిస్టులను ఏరేసేందుకు కేంద్రం పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించింది. అడవుల్లో కూంబింగ్ చేస్తోంది. మరోవైపు వారిని అడ్డుకునేందుకు నక్సల్స్ పావులు కదుపుతున్నారు. ఫలితంగా ఎన్ కౌంటర్లు అనివార్యమవుతున్నాయి. ఇరువైపులా నష్టం జరుగుతోంది. తాజాగా తర్రెమ్ ఎన్ కౌంటర్ లో ఇదే జరిగింది. బీజపూర్ జిల్లా తర్రెమ్ అటవీప్రాంతంలోని జొన్నగూడ దగ్గర పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి.

బీజాపూర్ జిల్లాలోని తార్రెమ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా అధికారులకు సమాచారం అందించింది. ఇదే క్రమంలోనే అడవులను భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నారు. శనివారం కూంబింగ్ నిర్వహిస్తుండగా మధ్యాహ్నం 1 గంట సమయంలో భద్రతా సిబ్బందికి మావోయిస్టులు తారసపడ్డారు. తప్పించుకునే క్రమంలో మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే జవాన్లు కూడా కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు భద్రతా సిబ్బందితో పాటు ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ప్రస్తుతం తార్రెమ్ అటవీ ప్రాంతం మొత్తం భద్రతా దళాలు మోహరించాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

గత కొద్ది రోజులుగా మావోయిస్టు దళాల సంచారం పెరిగిపోయింది.. దళాల్లోకి రిక్రూట్‌మెంట్‌లు జరుగుతున్నాయి. మారుమూల గ్రామాల్లో వారికి ఆదరణ, ఆశ్రయం పెరుగుతుందనే చర్చ వినిపిస్తోంది. కేంద్ర ఆపరేషన్ ప్రహార్ మొదలుపెడితే కొత్తగా ఇంకో రెండు రాష్ట్రాలకు విస్తరించే వ్యూహంలో మావోయిస్టులు పావులు కదుపుతున్నారు. బెంగాల్, బీహార్ లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్‌, ఏపీ, తెలంగాణ పోలీసుల ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తుంది.. మావోల కట్టడికి 4 రాష్ట్రాల పోలీసుల జాయింట్ యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఓఎస్డీలను నియమిస్తున్నారు. రిటైర్డ్‌ పోలీసు అధికారులకూ బాధ్యతలు అప్పగిస్తున్నారు. మావోల రిక్రూట్‌మెంట్‌లపై పల్లెల్లో ఆరా తీస్తున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు, జిపిఎస్ సిస్టమ్, సెల్ టవర్లు, రోడ్ల నిర్మాణం, రేడియో టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టుల ఆట కట్టించేందుకు అన్నిటిని సంసిద్ధం చేసుకుంటున్నారు.

మరికొన్ని భారీ ఎన్ కౌంటర్లు, ఘటనలు

1. మార్చి29, 2021 మ‌హారాష్ట్ర‌లోని గ‌డ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంట‌ర్ ఐదుగురు మావోయిస్టులు మృతి 2. గ‌డ్చిరోలి జిల్లా కోబ్రామెడ అట‌వీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ ఆప‌రేష‌న్ పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య జ‌రిగిన ఎదురు కాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు మృతి 3. అక్టోబర్‌24, 2016 ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా ఆంధ్రా ఒరిస్సా స‌రిహ‌ద్దు (ఏవోబీ)లో భారీ ఎన్‌కౌంటర్‌ 23 మంది మావోయిస్టులు మృతి 4. మార్చి2,2018 తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతి 5. జులై 20, 2018 ఛత్తీస్‌ ఘడ్‌లోని దంతెవాడ-బీజాపూర్‌ సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఎన్‌కౌంటర్‌ ఏడుగురు మావో యిస్టులు మృతి 6. ఆగస్టు4, 2019 ఛత్తీస్ ఘడ్ లోని రాజ్ నందగావ్ జిల్లా సీతగోట అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ ఏడుగురు మావోయిస్టులు హతం 7. సెప్టెంబర్‌22,2019 విశాఖలోని ధారకొండ ఏజెన్సీలోని మాదిగమల్లులో భారీ ఎన్‌కౌంటర్, ఐదుగురు మావోయిస్టుల మృతి 8. ఫిబ్రవరి 22,2020 ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి 9. మే9, 2020 ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీ రాజనందగావ్ జిల్లా మన్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పర్దోనిలో ఎన్‌కౌంటర్‌ ఎస్‌ఐ సహా నలుగురు మావోయిస్టులు హతం 10. జులై6, 2020 ఒడిశా కంధమాల్ జిల్లా సిర్లా అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ నలుగురు మావోయిస్టులు హతం

కొత్త పోలీసు చట్టాన్ని వ్యతిరేకిస్తూ కదంతొక్కిన బ్రిటన్ వాసులు.. “కిల్ ది బిల్” పేరుతో నిరసన

Pawan Kalyan In Tirupati: ‘సీఎం కావాలని ఏనాడు ఆలోచించలేదు’.. ఎన్నికల ప్రచారంలో పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

టిబెట్ మీదుగా విమానాలు ఎందుకు ప్రయాణించవు..! ఆ రహస్యం ఏంటో మీకు తెలుసా..?