Pawan Kalyan In Tirupati: ‘సీఎం కావాలని ఏనాడు ఆలోచించలేదు’.. ఎన్నికల ప్రచారంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Pawan Kalyan In Tirupati: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ పోటీలో నిలిచిన బీజేపీ అభ్యర్థురాలు రత్నప్రభకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న పవన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు...
Pawan Kalyan In Tirupati: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ పోటీలో నిలిచిన బీజేపీ అభ్యర్థురాలు రత్నప్రభకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న పవన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే అధికార పక్షం వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘జీవితంలో నాకు ఏ కోరిక లేదు.. దేశ భక్తి తప్ప. పోరాడి సాధించిన స్వాతంత్ర్యాన్ని కొందరు నేతలు నాశనం చేస్తున్నారు. నేను కాంట్రాక్టులు తీసుకొని డబ్బులు కాజేసే వ్యక్తిని కాదు. సినిమాల్లో రూ. కోట్లు సంపాదిస్తా.. కోట్ల రూపాయల పన్నులు కడుతా.. రూ. కోట్లు జనాలకు ఇస్తా. మనమందరం కలిసి వైసీపీకి బలాన్నిచ్చాం’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఏ గూండాలకైనా ఎంత కాలం భయపడతాం అంటూ అధికార నేతలను ఉద్దేశిస్తూ పవన్ విమర్శించారు. పులివెందుల పేరు దుర్మార్గాలకు, దోపీడీలకు అడ్రస్‌గా మారిపోయిందని దుయ్యబట్టారు. మానవ హక్కులు కాలరాసిపోతున్నాయన్నారు. ఫ్యాక్షన్ గూండాల దాడులకు భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదని చెప్పుకొచ్చారు. మర్యాదగా ఉండకపోతే రోడ్లపైకొచ్చి చొక్కొలు పట్టుకుని లాగుతామన్నారు. తిరుపతిని ఎవరు అభివృద్ధి చేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలని పవన్ ప్రజలను అడిగారు. వైసీపీ నేతలు తమ ప్రతాపాన్ని సామాన్యులపై కాదనీ.. దమ్ముంటే తనపై చూపాలనీ పవన్ సవాలు విసిరారు. రాష్ట్రంలో అధికార బదలాయింపు జరగాలని పవన్ అభిప్రాయపడ్డారు. శేషచలం అడవుల్లో ఎర్రచందనాన్ని ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. కూల్చే ప్రతి ఎర్రచందనం చెట్టు.. వైసీపీ పతనానికి మెట్టు అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఇక సీఎం పదవి గురించి మాట్లాడుతూ తానేప్పుడు సీఎం కావాలని ఆలోచించలేదచి చెప్పుకొచ్చారు. ఒకవేళ సీఎం పదవి వస్తే అందరికంటే ఎక్కువ సేవ చేయగలన్నారు. నటుడిగా మీ అభిమానాన్ని సంపాదించుకున్నా.. అంతకంటే పెద్ద పదవి లేదని చెప్పుకొచ్చారు. ఇలా మొత్తం మీద పవన్ తిరుపతి ప్రచారం వాడీవేడీగా సాగింది.