Andhra Pradesh: సన్యాసం తీసుకున్న మాజీ ఎమ్మెల్యే.. రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద శాస్త్రోక్తంగా స్వీకరణ..
Rama Krishna Rao Takes Monachism : సాధారణంగా రాజకీయ నేతల మధ్య వాదనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఒకరిపై ఒకరు వ్యంగ్యస్త్రాలు
EX-MLA Rama Krishna Rao: సాధారణంగా రాజకీయ నేతల మధ్య వాదనలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఒకరిపై ఒకరు వ్యంగ్యస్త్రాలు సంధించుకుంటారు. ఆ మాటల తూటాల మధ్య ఒక్కోసారి తాను మాట్లాడింది నిజం కాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చాలెంజ్‌లు చేస్తుంటారు.. అయితే ఇలా వ్యవహరించడం నిత్యం వారికి అలవాటే కానీ ఒక్కరు కూడా మాట మీద మాత్రం నిలబడరు. కానీ ఇక్కడ ఓ మాజీ ఎమ్మెల్యే ఏ మాట మాట్లాడకుండా.. ఏ ఛాలెంజ్ చేయకుండా తనకు తాను సన్యాసం స్వీకరించి అందరిని ఆశ్చర్యపరిచారు..
బద్వేలు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివరామకృష్ణారావు రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద శాస్త్రోక్తంగా గురువుల ఆశీస్సులతో సన్యాసం స్వీకరించారు. ఇకపై ఆయన స్వామి శివరామానంద సరస్వతిగా కొనసాగనున్నారు. ఈయన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడిగా పేరుగాంచారు. 1972లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బిజివేముల వీరారెడ్డిపై తొలుత ఓటమి చెందారు.
1977లో బద్వేలు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1983, 1985 ఎన్నికల్లో ఓటమి చెందారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి రెండోసారి గెలుపొందారు. 1994, 1999, 2001 ఉప ఎన్నికల్లో ఓటమి చెందారు. శివరామకృష్ణారావుతోపాటు అప్పట్లో పులివెందుల నుంచి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మైదుకూరు నుంచి డీఎల్ రవీంద్రారెడ్డిలు 1972లో తొలిసారి గెలుపొందారు.
2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 2009లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా మారడంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 2015 నుంచి ఆధ్యాత్మిక చింతనవైపు మొగ్గుచూపిన శివరామకృష్ణారావు మానస సరోవర్, చార్‌దాం, అమర్‌నాథ్‌తో పాటు శక్తి పీఠాలను సందర్శించారు. రిషికేశ్‌కు చెందిన గురువు శ్రీ సద్గురు తత్వవిదానంద సరస్వతి శిష్యరికంలో కొనసాగుతున్నారు.
శివరామకృష్ణారావు తండ్రి వడ్డెమాను చిదానందం. 1952లో తొలి సాధారణ ఎన్నికల్లో బద్వేలు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1955లో మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ 1962లో తిరిగి బద్వేలు నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మరోమారు శాసనసభ్యునిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. బ్రాహ్మణ సామాజికవర్గంలో ప్రత్యేక గుర్తింపు పొందిన శివరామకృష్ణారావు సుమారు 50 ఏళ్ల పాటు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో జిల్లా రాజకీయాల్లో చురుగ్గా పని చేశారు. 2009లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా మారింది. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండోసారి సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికయ్యాక కీలక పదవి లభిస్తుందని ఆశించారు. ఈ లోపే వైఎస్సార్ చనిపోవడంతో ఆయన రాజకీయ అడుగులకు బ్రేక్ పడినట్లు అయింది. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఏపీ స్టేట్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు శివరామకృష్ణారావు.
2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శివరామకృష్ణారావు ఆ పార్టీ నేతల గెలుపులో తన వంతు పాత్ర పోషించారు. 2015 నుంచి ఆధ్యాత్మిక చింతనవైపు మొగ్గుచూపిన శివరామకృష్ణారావు అనేక ఆలయాలు, మఠాలను సందర్శించారు. ముఖ్యంగా మానస సరోవర్, చార్‌దాం, అమర్‌నాథ్‌తో పాటు అనేక శక్తి పీఠాలను సందర్శించారు. రిషికేశ్‌కు చెందిన గురువు శ్రీ సద్గురు తత్వవిదానంద సరస్వతి శిష్యరికంలో ఆయన కొనసాగుతున్నారు. కొద్ది కాలంగా పూర్తి ఆధ్యాత్మిక జీవితంవైపు ఆకర్షితులయ్యారు మాజీ ఎమ్మెల్యే. చివరకు సన్యాస దీక్ష తీసుకోవాలనుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద గురువు శ్రీ సద్గురు తత్వ విదానందసరస్వతీ ఆధ్వర్యంలో దీక్ష తీసుకున్నారు.
కడప జిల్లా పోరుమామిళ్లలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కలమకూరులో శివాలయం, రామాలయాన్ని నిర్మించాడు శివరామకృష్ణారావు. అలానే కృష్ణుడి ఆలయం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఆ దేవుడి ఆజ్ఞతోనే తాను సన్యాస దీక్ష తీసుకున్నానని చెబుతున్నాడు మాజీ ఎమ్మెల్యే. సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని చింతతోనే గడపాలన్నది తన లక్ష్యమన్నారు శివరామకృష్ణారావు. ఆయన కుమారుడు డాక్టర్ శ్రీనివాసరావు కడప రిమ్స్‌లో దంత వైద్యులుగా పని చేస్తున్నారు.