KTR : సాగులో కేసీఆర్ దేశానికే పాఠాలు నేర్పుతుంటే, గుజరాత్‌లో కూడా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం లేదు : కేటీఆర్
KTR slams Modi Government : సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే తెలంగాణలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతూ దేశానికి పాఠాలు..
KTR slams Modi Government : సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే తెలంగాణలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతూ దేశానికి పాఠాలు నేర్పిస్తుంటే కేంద్రం మాత్రం కుంటి సాకులతో రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులకు కోత పెడుతోందన్నారు మంత్రి కేటీఆర్. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందించడం లేదన్నారు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కాబట్టే తెలంగాణలో రైతులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు కేటీఆర్.
ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతుల సౌకర్యార్థం నిర్మించిన రైతువేదికను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలం, మోహినికుంట గ్రామంలో రూ.3.27 కోట్లతో పేదల కోసం నిర్మించిన 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని కూడా మంత్రి నేడు ప్రారంభించారు.