Sagar By poll : సాగర్ ఉపఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు, బరిలో మిగిలింది చివరికి వాళ్లే..
Nagarjuna Sagar By Election : నల్గొండజిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలో కీలక నామినేషన్ల ఘట్టం ఇవాళ్టితో ముగిసింది. నామినేషన్ల..
Nagarjuna Sagar By Election : నల్గొండజిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలో కీలక నామినేషన్ల ఘట్టం ఇవాళ్టితో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో మొత్తం 19 నామినేషన్లు ఉపసంహరణకు గురయ్యాయి. దీంతో ఉపఎన్నికల బరిలో మొత్తంగా 41 మంది అభ్యర్థులు నిలిచారు. అభ్యర్థులెవరనేది నికరంగా లెక్కతేలడంతో సాగర్ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. పోటీ పోటీగా నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్తులకు గాలం వేసే పనిలో బిజీ అయ్యారు. చివరి వరకు అభ్యర్థి విషయంలో తర్జన భర్జన పడిన బీజేపీ.. ఇప్పుడు ఒక్కొక్కరు పార్టీని వీడుతూ ఉండటంతో కలవరానికి గురవుతోంది.
మరోవైపు, ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు సరిగానే ఉన్నా.. తెలంగాణలో మాత్రం బెడిసికొట్టిందనే గుసగుసలు వినిపిస్తున్న తరుణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రంగంలోకి దిగినట్టు సమాచారం. జనసేనానిని కూల్ చేసి సాగర్ లో ప్రచారం చేయించుకోవడం ద్వారా లబ్ది పొందాలని కూడా తెలంగాణ బీజేపీ నేతలు పావులుకదుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, సాగరసమరంలో సై అంటే సై అంటున్నారు మిగతా ప్రముఖ పార్టీల అభ్యర్థులు. కాంగ్రెస్ నేత జానా రెడ్డి బస్తీమే సవాల్ అంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. నామినేషన్ వేసి ప్రచారానికి వెళ్లకుండా డైరెక్ట్‌గా పోలింగ్‌కే వెళ్దామని.. అప్పుడు ఎవరు గెలుస్తారో వారిదే నిజమైన గెలుపు అని జానా సవాల్ విసిరుతున్నారు.
Read also : Humanity : మానవత్వం చాటుకున్న శ్రీశైలం పోలీసులు, ఆక్సిజన్ సిలిండర్ చేతపట్టి, భక్తుడ్ని భుజాలపై వేసుకుని..