టిబెట్ మీదుగా విమానాలు ఎందుకు ప్రయాణించవు..! ఆ రహస్యం ఏంటో మీకు తెలుసా..?
Why Planes Dont Fly Over Tibet : టిబెట్ దేశం భారత సరిహద్దు ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది.. ఈ దేశం మీదుగా విమానాలు ప్రయాణించడం నిషేధం.. దీనికి కారణాలు చాలా ఉన్నాయి.. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 03, 2021 | 8:39 PM

ఎవరెస్ట్ శిఖరం సరిహద్దును నేపాల్‌తో టిబెట్‌తో ఉంటుంది. అధిక పీఠభూముల కారణంగా ఈ ప్రదేశాలను 'రూఫ్ ఆఫ్ ది వరల్డ్' అని పిలుస్తారు. ఇక్కడ ఎత్తైన పర్వతాలు ఉన్నందున విమానాల ప్రయాణం చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.

ఇక్కడ ఎత్తైన పర్వతాలు ఉండటవ వల్ల విమాన ఇంజిన్‌లో సమస్యలు వస్తాయి. సాధారణంగా విమానం 20 వేల అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. కానీ ఎవరెస్ట్ పర్వతం దగ్గర అది సాధ్యపడదు..

ఇది కాకుండా టిబెట్ అల్ప పీడన ప్రాంతం. ఇక్కడ గాలి కొరత ఉంటుంది. విమానాలు ఎగరవలసి వస్తే.. అందులో కూర్చున్న ప్రయాణికులకు ఆక్సిజన్ కొరత ఉంటుంది. అత్యవసర సమయంలో 15-20 నిమిషాలు మాత్రమే ప్రయాణికులకు ఆక్సిజన్‌ను అందించగలరు..

ప్రయాణికులు ఊపిరి పీల్చుకోవాలంటే విమానం పర్వతాల కన్నా తక్కువ ఎత్తులో ప్రయాణించాల్సి ఉంటుంది. విమానానికి సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి వీటి ప్రకారం.. 10,000 అడుగుల ఎత్తు వరకు ఎగరవచ్చు.. కానీ ఈ ప్రాంతంలో ఇంత ఎత్తులో ఎగరడం అసాధ్యం.

విమానం తక్కువ ఎత్తులో ఎగిరితే.. అది ఎత్తైన పర్వతాలను తాకుతుంది. మీరు పర్వతాల పైన ఎగురుతుంటే ఆక్సిజన్ కొరత ఉంటుంది. అందుకే ఇక్కడ విమాన ప్రయాణం అంత శ్రేయస్కరం కాదు..



