Girl kidnap : మచిలీపట్నంలో మైనర్ బాలిక కిడ్నాప్, ఇళ్లు అద్దెకు దొరుకుతాయా.. అంటూ మత్తు మందు చల్లిన ఆగంతకుడు
Minor girl kidnap in Machilipatnam : ఇంటి దగ్గర ఆడుకుంటున్న మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడు ఒక ఆగంతకుడు. మాయమాటలు చెప్పి బాలికను ఎత్తుకెళ్లిపోయాడు. కృష్ణాజిల్లా మచిలీపట్నం సుకార్లబాద్..

Girl Kidnap
Minor girl kidnap in Machilipatnam : ఇంటి దగ్గర ఆడుకుంటున్న మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడు ఒక ఆగంతకుడు. మాయమాటలు చెప్పి బాలికను ఎత్తుకెళ్లిపోయాడు. కృష్ణాజిల్లా మచిలీపట్నం సుకార్లబాద్ లో ఈ ఘటన జరిగింది. ఇళ్లు ఏమైనా అద్దెకు దొరుకుతాయా అంటూ వచ్చిన సదరు వ్యక్తి మత్తు మందు చల్లి బాలికను బైక్ పై ఎక్కించుకుని పరారైపోయాడు. జిల్లా కోర్ట్ సమీపంలోకి వచ్చే సరికి తేరుకున్న బాలిక.. వెంటనే అరుపులు, కేకలు వేయడంతో బాలికను వదిలి నిందితుడు పరారయ్యాడు. సీసీ పుటేజ్ లో బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు, నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.