Corona : దేశం వెన్నులో వణుకు పుట్టిస్తోన్న కోవిడ్‌.. ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో భారత్ దే ఫస్ట్ ప్లేస్

Corona second wave in India : భారతదేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో భారత్ మొదటి స్థానానికి చేరింది. దీన్ని బట్టి చూస్తే కరోనా సెకండ్..

Corona : దేశం వెన్నులో వణుకు పుట్టిస్తోన్న కోవిడ్‌.. ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో భారత్ దే ఫస్ట్ ప్లేస్
Covid 19
Follow us
Venkata Narayana

|

Updated on: Apr 04, 2021 | 7:58 AM

Corona second wave in India : భారతదేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో భారత్ మొదటి స్థానానికి చేరింది. దీన్ని బట్టి చూస్తే కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 89,129 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక కోటీ 23,లక్షల 03వేల 131కి చేరుకుంది. రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇప్పటికే చేయిదాటిపోయినట్టు కనిపిస్తోంది. ఆ ప్రాంతాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది.

మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్. కేవలం ఈ ఎనిమిది రాష్ట్రాల్లోనే 81.42 శాతం కేసులు నమోదయ్యాయి. పుణె, ముంబై, నాగ్‌పూర్, థానే, నాసిక్, బెంగళూరు అర్బన్, ఔరంగాబాద్, ఢిల్లీ, అహ్మద్‌నగర్, నాందేడ్ జిల్లాలు కరోనా హాట్ స్పాట్లుగా మారాయి. ఈ పది జిల్లాల్లోనే రోజువారీ కేసుల్లో 50 శాతం కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో కేసుల పెరుగుదల తొమ్మిది రెట్లు నమోదవుతోంది. దేశం మొత్తంలో ఒక్క మహారాష్ట్ర నుంచే 59.36 శాతం కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర డేంజర్‌ జోన్లోకి వెళ్లిందని వేరే చెప్పక్కర్లేదు. అక్కడి ప్రతిరోజూ 47 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. తరువాత స్థానంలో ఉన్న కర్ణాటకలో 4,991, ఛత్తీస్‌గడ్‌‌లో 4,174 కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మహరాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌, పంజాబ్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో రోజువారీ కేసుల్లో పెరుగుదల ఎక్కువగా ఉంది. ఇక పంజాబ్‌లో అత్యధిక శాతం కేసుల పెరుగుదల కనిపిస్తోంది.

ఆరున్నర నెలల్లో రోజువారీ అత్యధిక పెరుగుదలలో ఇదే అత్యధిక కేసుల నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 1.23 కోట్లకు పైగా నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 1,64,110 కి పెరిగింది. ఒక్క రోజులోనే 714 మరణాలు సంభవించాయి. గత అక్టోబర్ నెల తరువాత ఈ గణాంకాలే నమోదే అధికం. కొత్త మరణాల్లో 85.85 శాతం కేవలం 6 రాష్ట్రాల నుంచే వచ్చాయి. మహారాష్ట్రలో గరిష్టంగా 481 మంది మరణించగా.. 57 మంది పంజాబ్‌లో మరణించారు. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదుకాలేదు.

Read also : Non GST Revenue : జీఎస్టీయేతర పన్ను వసూళ్లలో దూసుకెళ్తోన్న సాగర నగరం, లేటెస్ట్ టెక్నాలజీతో అంతమొత్తం పన్నుల వసూళ్లా.. అదెలా..?