LG Smart Phones: మూతపడిన ఎల్జీ స్మార్ట్ ఫోన్ డివిజన్..నష్టాలతో మార్కెట్ల నుంచి కనుమరుగవుతున్నపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్!
దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తన స్మార్ట్ ఫోన్ డివిజన్ మూసివేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. అధిగమించలేని నష్టాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
LG Smart Phones: దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తన స్మార్ట్ ఫోన్ డివిజన్ మూసివేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. అధిగమించలేని నష్టాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
స్మార్ట్ ఫోన్ డివిజన్ లో పెద్ద సంస్థల్లో ఎల్జీ ఒకటి. మార్కెట్ నుంచి ఒక పెద్ద సంస్థ స్మార్ట్ ఫోన్ డివిజన్ మూసివేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఉత్తర అమెరికాలో మూడో పెద్ద ఫోన్ బ్రాండ్ గా ఉన్న ఎల్జీకి పదిశాతం మార్కెట్ ఉంది. అదేవిధంగా ఆపిల్, శాంసంగ్ అక్కడ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
ఎల్జీ స్మార్ట్ ఫోన్ డివిజన్ దాదాపు ఆరేళ్లుగా భారీ నష్టాలను చవిచూస్తోంది. ఇప్పటివరకూ 4.5 బిలియన్ డాలర్ల (దాదాపు 33,010 కోట్ల రూపాయలు) నష్టాన్ని ఈ డివిజన్ మూటగట్టుకుంది. దీంతో ఎల్జీకి దీనిని మూసివేయడం తప్ప మరో మార్గం లేకుండాపోయింది. ఇప్పుడు ఎల్జీ సంస్థ ఇతర డివిజన్ల పై మరింత ఫోకస్ పెట్టె అవకాశం కనిపిస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్, స్మార్ట్ హొమ్స్ వంటి ప్రాజెక్టులపై ఇక ఎక్కువగా దృష్టి సారించనున్నట్టు ఎల్జీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎల్జీ ప్రస్తానం ఇదీ..
సెల్ ఫోన్ డివిజన్ లో ఎల్జీ ఒకప్పుడు మంచి స్థానంలో నిలిచింది. ఆకట్టుకునే మోడల్స్ లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంది. ఎల్జీ మొట్టమొదటి సరిగా 2013లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఫీచ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఆపిల్, శాంసంగ్ తరువాత మూడో స్థానానికి చేరుకుంది.
కానీ, తరువాత తరువాత ఎల్జీ మార్కెట్ లో వెనుకబడింది. స్మార్ట్ ఫోన్లలో మంచి బ్రాండ్లు విడుదల చేసినా, అవి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ సమస్యల బారిన పడటం, అప్డేట్స్ చాలా తక్కువగా మెల్లగా వస్తుండటం ఎల్జీ స్మార్ట్ ఫోన్ల నుంచి వినియోగదారులు దూరం జరిగారు. దీంతో ఎల్జీ స్మార్ట్ ఫోన్ డివిజన్ నష్టాల బాట పట్టింది.
మార్కెట్ప్ర విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం ఎల్జీ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో కేవలం 2 శాతం మాత్రమే మార్కెట్ షేర్ తో ఉంది. గతేడాది 23 మిలియన్ల ఫోన్లను మాత్రమే విడుదల చెయగలిగింది. అదే సమయంలో శాంసంగ్ 256 మిలియన్ల ఫోన్లను విడుదల చేసింది. అయితే, లాటిన్ అమెరికా ప్రాంతంలో మాత్రం ఎల్జీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో 5వ బ్రాండ్ గా ఉండటం విశేషం.
ఎల్జీ తీసుకున్న ఈ నిర్ణయంతో దక్షిణ కొరియాలో ఒప్పో, వివో, జియోమీ వాంతి చైనా ఫోన్ల కంపెనీలకు మేలు జరిగే అవకాశం అనిపిస్తోందని కేప్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సెక్యూరిటీస్ కు చెందిన విశ్లేషకుడు పార్క్ సంగ్ సూన్ అభిప్రాయపడ్డారు.
ఎల్జీ వ్యాపార సామ్రాజ్యంలో ఉన్న ఐదు డివిజన్లలో స్మార్ట్ ఫోన్ డివిజన్ అతి చిన్న దివిజ. గత జూలై 31 నాటికి ఎల్జీ మొత్తం వ్యాపారంలో కేవలం 7శాతం మాత్రమే స్మార్ట్ ఫోన్ డివిజన్ నుంచి వచ్చింది.
దక్షిణ కొరియాలో ఉన్న ఎల్జీ స్మార్ట్ ఫోన్ డివిజన్ ఉద్యోగులను ఇతర డివిజన్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇక ఇప్పటికే ఎల్జీ ఫోన్లను కలిగి ఉన్న వినియోగదారులకు కొంతకాలం పాటు సాఫ్ట్ వేర్ అప్డేట్లను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.
Also Read: Top Smartmobiles: ఏప్రిల్ నెలలో భారత్‌లో విడుదల కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..!