Gold Price: బంగారం ధర మరోసారి రూ.50 వేలకు చేరనుందా..? మార్కెట్లో జోరందుకున్న ఊహాగానాలు..!

Gold Price: బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే పసిడి ధర మళ్లీ ఎగబాకుతోంది. స్వల్పంగా..

Gold Price: బంగారం ధర మరోసారి రూ.50 వేలకు చేరనుందా..? మార్కెట్లో జోరందుకున్న ఊహాగానాలు..!
Gold
Follow us
Subhash Goud

|

Updated on: Apr 05, 2021 | 7:56 AM

Gold Price: బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే పసిడి ధర మళ్లీ ఎగబాకుతోంది. స్వల్పంగా పెరుగుతూ ముందుకెళ్తోంది. ఇక తాజాగా పసిడి ధరలపై కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేలు తాకే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌లో ఊహాగానాలు మరోసారి జోరందుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు దేశ వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వైరల్‌ కావడంతో మరోసారి ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై, అలాగే మహారాష్ట్రలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతుండటంతో ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై చూపే అవకాశాలున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే గత మూడు నెలలుగా బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. దీంతో బంగారం ధర రూ.40 వేల దిగువకు సైతం వెళ్లే అవకాశం ఉందని వార్తలు జోరందుకున్నాయి. కానీ పరిస్థితి మరోసారి రివర్స్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం దేశీయ స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌, నిఫ్టీ జీవిత కాల గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ 50 వేల పాయింట్ల ఎగువన ట్రేడ్‌ అవుతుంటే నిఫ్టీ కూడా 15 వేల పాయింట్ల సమీపంలో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి స్టాక్‌ మార్కెట్లు కరెక్షన్‌కు గురయ్యే అవకాశం కనిపిస్తోందని ట్రేడ్‌ నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా పసిడి వైపు మదుపరులు తమ పెట్టుబడులను తరలించే అవకాశం ఉందని వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే బంగారం మరోసారి భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాముల ధర 44,910 వద్ద ట్రేడవుతోంది. అయితే ఏప్రిల్‌ 1 నుంచి పసిడి ధరలు 10 గ్రాములకు రూ. 44,865 పలికింది. యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ యొక్క 2.25 ట్రిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల ప్రణాళిక, కోవిడ్‌ వ్యాప్తిని పరిమితం చేయడానికి దేశాలు విధించిన వదులుగా ఉన్న ద్రవ్య వైఖరి లాక్‌డౌన్‌ మద్దతు ఇచ్చాయి. మరోవైపు పసిడి లోహం MCX లో నాలుగు ట్రేడింగ్ సెషన్లలో మూడింటిలో పెరిగింది. అయితే వారానికి రూ.125 లేదా 0.28 శాతం లాభంతో ముగిసింది.

10 గ్రాముల ధర రూ.50 వేలకు చేరుకుంటుందా..?

ప్రస్తుతం ట్రెండ్‌ను బట్టి చూస్తుంటే కరోనా కేసులు గత సంవత్సరం లాగానే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధర మరోసారి పెరిగే అవకాశాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే ధోరణి కొనసాగితే మరో రెండు మూడు వారాల్లో బంగారం ధరలు పెరగడం ఖాయమని చెబుతున్నారు నిపుణులు. మరి మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నట్లే బంగారం ధర మళ్లీ 50 వేలకు తాకుతుందా ..?లేదా అనేది చూడాలి.

ఇవీ చదవండి: Gold-Silver Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దేశవ్యాప్తంగా ఈరోజు గోల్డ్‌, సిల్వర్‌ రేట్ ఇలా ఉంది..

Kia Sonet: మార్కెట్లోకి కొత్త కియా సోనెట్ కారు .. ధర తెలిస్తే ఆశ్యర్యపోతారు.. 16 వేరియంట్లలో లభ్యం

ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..