Rashmika Mandanna: బర్త్‌డే బ్యూటీకి సర్‌ప్రైజ్ ఇచ్చిన కొత్త సినిమా యూనిట్.. చీర కట్టులో ఆకట్టుకుంటోన్న అందాల తార..
Rashmika Mandanna: 'ఛలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి రష్మిక మందన. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ...
Rashmika Mandanna: ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి రష్మిక మందన. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ చిన్నది వరుస సినిమాలతో దూసుకెళుతోంది. అతికొద్ది సమయంలో టాలీవుడ్‌లోని అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో బన్నీ సరసన ‘పుష్ఫ’సినిమాతో పాటు శర్వనంద్ జోడిగా ‘ఆడవారు మీకు జోహర్లు’ అనే సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలతో పాటు హిందీలోనూ రెండు చిత్రాల్లో నటిస్తోంది. పేరుకు కన్నడ భామే అయినా తెలుగమ్మాయిగా మారిపోయింది రష్మిక. ఇక ఈ అందాల తార పుట్టిన రోజు నేడు (ఏప్రిల్ 5). ఈ సందర్భంగా ఆమె సన్నిహితులతో పాటు చిత్ర యూనిట్‌కు చెందిన ప్రముఖులు రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఆడ వారు మీకు జోహార్లు’ చిత్ర యూనిట్ రష్మికకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో రష్మిక ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ఈ ఫస్ట్‌లుక్‌లో రష్మిక పసుపు రంగు చీరలో చూడముచ్చటగా కనిపిస్తోంది. ఇక చిత్ర దర్శకుడు తిరుమల కిషోర్ రష్మిక ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘సూపర్ ట్యాలెంట్ అండ్ బ్యూటిఫుల్ నటి రష్మికతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. మా చిత్ర యూనిట్ తరఫున రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ జోడించాడు.
తిరుమల కిషోర్ చేసిన ట్వీట్…
Happy to team up with gorgeous & talented @iamRashmika for our #AadavaalluMeekuJohaarlu#HBDRashmikaMandanna ?@ImSharwanand @SLVCinemasOffl pic.twitter.com/ZQ36l3jgRc
— Tirumala Kishore (@DirKishoreOffl) April 5, 2021
Ariyana Glory : ఇక పై కనిపించను.. అర్థం చేసుకోండి.. అరియానా కామెంట్స్ వైరల్ వీడియో..