Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic Movie Teaser: ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో..లేదా అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం’.. రిపబ్లిక్ టీజర్

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరో వస్తున్న సినిమా రిపబ్లిక్. దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో

Republic Movie Teaser: 'ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో..లేదా అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం'.. రిపబ్లిక్ టీజర్
Republic
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 05, 2021 | 12:01 PM

Republic Movie : మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరో వస్తున్న సినిమా రిపబ్లిక్. దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుది. చిత్రలహరి సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్. ఆతర్వాత కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కథల ఎంపిక విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ‘చిత్రలహరి’ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్ లో ప్రతిరోజు పండగే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత ‘సోలో బ్రతుకే సోబెటర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.  ఈ క్రమంలో ఇప్పుడు రిపబ్లిక్ అనే ఇంట్రస్టింగ్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత దేవాకట్టా నుండి మూవీ రాబోతుండటంతో ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తోంది. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కేవలం 64 రోజుల్లో ఎలాంటి కరోనా కేసులు లేకుండా పూర్తి చేశామని తెలిపారు మేకర్స్. తాజాగా ఏ ఈసినిమానుంచి టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సారి తేజ్ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

P Balachandran Died: ప్రముఖ మలయాళ నటుడు పి. బాలచంద్రన్ అనారోగ్యంతో మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు

Wild Dog Movie: జోష్ లో వైల్డ్ డాగ్ టీమ్.. మెగాస్టార్ ముఖ్య అతిధిగా సక్సెస్ మీట్..

లవ్‌ ఫెయిల్యూర్‌ బాధను భరిచడం చాల కష్టం..తన బ్రేకప్ గురించి చెప్పిన అంజలి.. : Anjali About Breakup video.