Wild Dog Movie: జోష్ లో వైల్డ్ డాగ్ టీమ్.. మెగాస్టార్ ముఖ్య అతిధిగా సక్సెస్ మీట్..

కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల అయ్యింది.

Wild Dog Movie:  జోష్ లో వైల్డ్ డాగ్ టీమ్.. మెగాస్టార్ ముఖ్య అతిధిగా సక్సెస్ మీట్..
Chiranjeevi And Nagarjuna For Wild Dog Succesmeet
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 05, 2021 | 11:17 AM

Wild Dog Movie: కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల అయ్యింది. ‘హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేళుళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే ‘వైల్డ్ గాడ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. నగరంలో బాంబులను పెట్టిన ఉగ్రవాదులను పట్టుకోవడమే కథాంశంగా ఈ సినిమాను రూపొందించారు. సయామీ ఖేర్, దియా మీర్జా, అతుల్ కుల్ కర్ణి ప్రధాన పాత్రలో నటించారు. ఎన్‌ఐఎ బృందం సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను ఏరివేసే నేపథ్యంలో కథ సాగుతుంది. ఇక ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోవడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.