Corona Cases India: భారత్‌లో మళ్లీ పడగ విప్పిన కరోనా.. ఒక్క రోజులో లక్ష కేసులు.. యూఎస్ తర్వాత.!
Corona Cases India: భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య...
Corona Cases India: భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతూపోతోంది. ఇప్పటిదాకా వేలల్లో నమోదైన ఆ సంఖ్య.. ఇప్పుడు ఏకంగా లక్ష దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,03,558 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో పాజిటివ్ కేసులు ఇంతగా నమోదు కావడం ఇదే మొదటిసారి.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. యూఎస్ తర్వాత ఒక్క రోజులో లక్ష కేసుల నమోదైన రెండో దేశం ఇండియా కావడం గమనార్హం. ఇక ఈ కేసుల్లో ఎక్కవ శాతం మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఆదివారం దేశంలో 1,03,558 పాజిటివ్ కేసులు, 478 మరణాలు సంభవించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. దీనితో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,25,89,067 కరోనా కేసులు నమోదు కాగా.. 1,65,101 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు.
కాగా గడిచిన 24గంటల్లో ఈ మహమ్మారి నుంచి 52,847 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 1,16,82,136కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,41,830 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 92.80శాతం ఉండగా.. మరణాల రేటు 1.31శాతం ఉంది. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 8,93,749 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరు 24,90,19,657 పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది. కాగా, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 7,59,79,651 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ ట్విట్టర్ వేదికగా తెలిపింది.
Also Read:
Viral: నిమిషాల్లో ప్రాణాలు తీసే మొక్క.. పాము కంటే అత్యంత ప్రమాదకరం.. తస్మాత్ జాగ్రత్త.!
Scary Video: ”నువ్వు తోపు.. అయితే నాకేంటి”.. మొసలిని లెక్క చేయని జీబ్రా.. ఏం జరిగిందంటే.!
అద్భుత రికార్డు.. 13 బంతుల్లో 10 వికెట్లు పడగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. అతడు ఎవరంటే.!