Anand Mahindra: పట్నమొచ్చిన ఏనుగు ఫాంట్ షర్ట్ వేసింది..ఎలి ‘పాంట్’ అంటూ ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ వైరల్!
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. వ్యాపారంలోనే కాదు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ ఏక్టివ్ గా ఉంటారు. అంతేకాదు, ఆయన ట్విట్టర్ లో ఉంచే పోస్ట్ లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
Anand Mahindra: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. వ్యాపారంలోనే కాదు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ ఏక్టివ్ గా ఉంటారు. అంతేకాదు, ఆయన ట్విట్టర్ లో ఉంచే పోస్ట్ లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దానికి తోడు ఆపోస్టులకు ఆయన ఇచ్చే క్యాప్షన్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి.
తాజాగా ఆనంద్ మహీంద్రా చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారిపోయింది. నెటిజన్లు ఆ ట్వీట్ కు వివిపరీతంగా లైకులు చేస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే..
ఒక ఏనుగు.. పింక్ కలర్ షార్ట్, తెల్లటి ఫాంట్ వేసుకుని ఇన్ షర్ట్ చేసుకుని నల్లటి బెల్ట్ తగిలించుకుని ఠీవీగా రోడ్డుపై నడుస్తూ వెళుతోంది. దానిని లుంగీ కట్టుకున్న ఓ మావటి తీసుకువెళుతున్నారు.
ఈ ఫోటో కలర్ ఫుల్ గా కనుల విందుగా ఉంటె.. దానికి ఆనంద్ మహీంద్రా ఇచ్చిన కాప్షన్ ఇంకా అదిరిపోయింది. ఇన్క్రెడిబుల్ ఇండియా.. ఎలి ‘పాంట్’ అంటూ ఆయన రాసిన కాప్షన్ కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ ట్వీట్ పై మీరూ ఓ లుక్కేయండి ముందు..
Incredible India. Ele-Pant… pic.twitter.com/YMIQoeD97r
— anand mahindra (@anandmahindra) March 3, 2021
ఆనంద్ మహీంద్రా ఈ ట్వీట్ చేసిన కొద్దీ సేపట్లోనే వేలాది మంది దీనికి లైకులు కొట్టేశారు. అంతేకాదు.. కింద కామెంట్లు కూడా అదరగొట్టేశారు.
సోనమ్ చౌహాన్ అనే మహిళ ”అంతా బాగానే ఉంది.. కానీ, టైలర్ కొలతలు ఎలా తీసుకుని ఉన్నారంటారు?” అని ప్రశ్నించింది.
Incredible India. Ele-Pant… pic.twitter.com/YMIQoeD97r
— anand mahindra (@anandmahindra) March 3, 2021
రమేష్ మిశ్రా అనే ఆయన ”ఇంపాజిబుల్ ఈస్ నథింగ్” అని కామెంటారు.
Incredible India. Ele-Pant… pic.twitter.com/YMIQoeD97r
— anand mahindra (@anandmahindra) March 3, 2021
ఇంకో ఆయన..”ఏనుగుకు పాంట్.. మావటి లుంగీ.” అంటూ కామెంట్ రాశారు. మొత్తమ్మీద ఆనంద్ మహీంద్రా మళ్ళీ తన ట్వీట్ తో నెటిజన్లకు మంచి విషయాన్ని పంచారు.