Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra Tweet: ఇచ్చిన మాట నేరవేర్చిన ఆనంద్‌ మహీంద్ర… సాకారమవుతోన్న ‘ఇడ్లీ బామ్మ’ కలల సౌధం…

Anand Mahindra Tweet: సమాజంలో జరుగుతోన్న అంశాలపై ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో స్పందిస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర. తన దృష్టిని వచ్చిన ఆసక్తికర విషయాలు, ప్రేరణ కలిగించే అంశాలను నెట్టింట పోస్ట్ చేస్తుంటారు. వృత్తి పరంగా..

Anand Mahindra Tweet: ఇచ్చిన మాట నేరవేర్చిన ఆనంద్‌ మహీంద్ర... సాకారమవుతోన్న 'ఇడ్లీ బామ్మ' కలల సౌధం...
Idli Amma
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 02, 2021 | 8:55 PM

Anand Mahindra Tweet: సమాజంలో జరుగుతోన్న అంశాలపై ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో స్పందిస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర. తన దృష్టిని వచ్చిన ఆసక్తికర విషయాలు, ప్రేరణ కలిగించే అంశాలను నెట్టింట పోస్ట్ చేస్తుంటారు. వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. ఒక్క రూపాయికే ఇడ్లీ విక్రయిస్తూ ఎంతో మంది ఆకలి తీర్చిన తమిళనాడుకు చెందిన కమలాథల్‌ అనే బామ్మ ఎంత పాపులర్‌ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇడ్లీ బామ్మ’గా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారీ బామ్మ. ఈ క్రమంలోనే వీడియోను షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర.. కట్టెల పొయ్యితో ఇడ్లీలు చేస్తోన్న బామ్మకు ఎల్పీజీ గ్యాస్‌ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ హామీని అప్పట్లోనే నెరవేర్చారు కూడా. ఇక ఆమెకు ఇల్లు లేదా హోటల్‌ నిర్మిస్తానని గతంలో ప్రకటించిన ఆనంద్‌ మహీంద్ర తాజాగా అ పనిని కూడా పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే తాజాగా కొయంబత్తూరులో ఓ ఇంటిని నిర్మించి ఇచ్చేందుకు ఆనంద్‌ మహీంద్ర చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం కమలాథల్‌ ఇంటి నిర్మాణానికి సంబంధించి భూమి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆనంద్‌ మహీంద్రం ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ఆ బామ్మకు త్వరలోనే ఇంటితోపాటు ఇడ్లీలు అమ్ముకునేందుకు వీలుగా ఓ నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపిన ఆనంద్‌ మహీంద్ర త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.

ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్..

Also Read: Not A Common Man Movie : విశాల్‌ -31 నాట్ ఏ కామన్ మ్యాన్.. అదరగొడుతున్న కొత్త సినిమా ప్రీ లుక్‌.. ఫిదా అవుతున్న అభిమానులు..

Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఉన్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..

Funny Photos: వాష్‌ బెసిన్‌ ట్యాప్‌ హ్యాండిల్‌ విరిగిపోతే ఏంటీ.. పాడైపోయిన మొబైల్‌ ఫోన్‌ ఉందిగా.. ఈ ఫొటోలు చూస్తే..