Narender Vaitla |
Updated on: Apr 02, 2021 | 8:28 PM
ప్రతి రోజూ సోషల్ మీడియా రకరకాల ఫొటోలు చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని ఆలోచనను రేకెత్తిస్తే.. మరికొన్ని నవ్వులు పూయిస్తుంటాయి. అలాంటి కొన్ని ఫన్నీ ఫొటోలపై ఓ లుక్కేయండి..
పిజ్జా తయారు చేయాలంటే మైక్రోవేవ్ ఉండాలని మనందరికీ తెలుసు.. కానీ ఈ వ్యక్తిని చూడండి ఐరన్ బాక్స్, హెయిర్ స్ట్రెయిట్‌నర్‌తో పిజ్జాను ఎలా తయారు చేస్తున్నాడో.
పర్యావరణానికి హానీ చేసే ప్లాస్టిక్ బాటిల్‌ను ఇలా కూడా వాడుకోవచ్చని ఈయన ద్వారానే నేర్చుకోవాలి. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటే ఇదే కాబోలు.
వాష్ బెసిన్ ద్వారా బాకెట్‌లో నీటిని నింపడం అసాధ్యమని మనకు తెలుసు. కానీ మనసుండాలే కానీ ఏదైనా చేయొచ్చని చెబుతోందీ ఫొటో.
వేడెక్కుతోన్న కంప్యూటర్‌ను కూల్ చేయడానికి ఏసీనే కావాలా..? ఫ్యాన్‌తో కూడా కూల్ చేయొచ్చు ఇలా..
ఒకప్పుడు బాగా వినియోగంలో ఉన్న ల్యాండ్ ఫోన్లు ఇప్పుడు మూలన పడ్డాయి. కానీ ఖాళీగా ఉన్న రిసీవర్‌ను ఇలా కూడా వాడుకోవచ్చని తెలిస్తే వాటిని అస్సలు పడేయరు.