తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 1,097 మందికి పాజిటివ్, ఆరుగురు మృతి
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది.
Telangana corona cases: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. గత కొన్నిరోజులుగా పాజిటివ్ కేసులు వేయికి పైగా నమోదవుతున్నాయి. తాజాగా మరోసారి కేసుల సంఖ్య వెయ్యి దాటింది. అయితే.. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 43,070 కరోనా పరీక్షలు నిర్వహించగా రాష్ట్రంలో కొత్తగా 1,097 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,237కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,746 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదిలావుంటే, శనివారం రాత్రి 8గంటల నుంచి ఆదివారం రాత్రి 8గంటల వరకు కరోనా మహమ్మారి బారినపడి మరో ఆరుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,723కి చేరింది. మరోవైపు, ఆదివారం మరో 268 మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,458 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 302 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read Also… P Balachandran Died: ప్రముఖ మలయాళ నటుడు పి. బాలచంద్రన్ అనారోగ్యంతో మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు